అల్వాల్, వెలుగు: చార్మినార్ డివిజన్ ఏసీపీ భార్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అల్వాల్‌లోని బృందావన కాలనీలో చంద్రశేఖర్, హేమలత (52) దంపతులు ఉంటున్నారు. చంద్రశేఖర్ ప్రస్తుతం చార్మినార్ డివిజన్ ఏసీపీగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. రోజు లాగే ఏసీపీ చంద్రశేఖర్ డ్యూటీకి వెళ్లాడు. మధ్యాహ్నం భార్య హేమలతకు ఫోన్ చేసినా లిప్ట్చేయలేదు.
దీంతో అనుమానం వచ్చి ఆయన తన కొడుకుకు ఫోన్ చేసి ఏమైందో తెలుకోమని చెప్పాడు. కొడుకు ఇంటికి పోయి చూసేసరికి హేమలత ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆమె అప్పటికే చనిపోయిందని పోలీసులు నిర్ధారించారు. ఇంట్లో గొడవల వల్లనా లేక అనారోగ్య సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
