- గోవధ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే
- తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ
- సంపూర్ణ నిషేధ ఉత్తర్వుల అమలుకు తాత్కాలిక నిలుపుదల
గోవధ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో గోవధను సంపూర్ణంగా నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బహిరంగ ప్రదేశాల్లో గోవధను సంపూర్ణంగా నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధంపై స్టే మంజూరు చేసింది.
