చెక్ డ్యామ్ ల నిర్మాణానికి శంకుస్థాపన

చెక్ డ్యామ్ ల నిర్మాణానికి శంకుస్థాపన

తొగుట(అక్బర్‌‌‌‌పేట్, భూంపల్లి) వెలుగు: చెక్ డ్యామ్  నిర్మాణంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రబాక రెడ్డి తెలిపారు. అక్బర్‌‌‌‌పేట్, భూంపల్లి మండలంలోని నగరం గ్రామపంచాయతీ పరిధిలో చెక్ డ్యామ్  నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  ప్రాంతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను చేపడుతున్నామని, ప్రతి గ్రామంలో ప్రజలకు ఉపయోగపడేలా ప్రణాళికాబద్ధంగా పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఉప కాలువల నిర్మాణంపై రివ్యూ..

ఉప కాలువల నిర్మాణం కోసం శుక్రవారం దౌల్తాబాద్  మండలంలోని గువ్వలేగిలో సిద్దిపేట ఆర్డీవో సదానందంతో కలిసి రైతులతో ఎమ్మెల్యే ప్రభాకర్​రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కాలువల నిర్మాణం, భూసేకరణ, పరిహారం వంటి అంశాలపై చర్చించారు. రైతుల అభిప్రాయాలను  తెలుసుకున్నారు. ఉప కాలువలు పూర్తయితే ఈ ప్రాంతం పచ్చని పంటలతో కళకళలాడుతుందని తెలిపారు. రైతులు కాలువల నిర్మాణానికి సహకరించాలని కోరారు. అంతకుముందు దౌల్తాబాద్  మండలంలోని పలు గ్రామాల్లో రూ.1.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం లో మండల, గ్రామ అధికారులు, సర్పంచ్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.