నవంబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘ఛెల్లో షో’

నవంబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘ఛెల్లో షో’

ఇటీవల ఆస్కార్ కు నామినేట్ అయిన మూవీ ‘ఛెల్లో షో’ త్వరలో ఓటీటీలోనూ సందడి చేయనుంది. దర్శకుడు నలిన్‌ రూపొందించిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ లో నవంబర్‌ 25న  ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నలిన్ నెట్‌ఫ్లిక్స్‌కు థ్యాంక్స్  తెలిపారు. ఛెల్లో షో అనేది సినిమా కాదు.. ఒక వేడుక అని చెప్పారు. ఇప్పుడు ఈ వేడుకను భారతదేశంలోని ప్రజలందరూ చేసుకోనున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. 

అక్టోబర్ 14న రిలీజై.. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ కేటగిరీలో ఆస్కార్‌కు ఎంపికైన ఛెల్లో షో.. దర్శకుడు నలిన్‌ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కించారు. చిన్న తనంలో ఆయనకు సినిమాలంటే మక్కువ ఎలా కలిగింది. సినిమా అనేది ఆయన కలగా ఎలా మారిందన్న విషయాలను ఈ మూవీలో చక్కగా చూపించారు. హృదయాలను హత్తుకునే కథాంశంతో తీసిన ఈ చిత్రంలో భవిన్‌ రాబరి, భవేశ్‌ శ్రీమాలి, రిచా మీనా, దిపెన్‌ రావల్‌, పరేశ్‌ మెహతా ప్రధాన పాత్రలు పోషించారు. ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’ అనే ఇంగ్లీష్ పేరుతో ఈ సినిమా గతేడాది జూన్‌లో ‘ట్రిబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో స్క్రీనింగ్ అయ్యింది.