IPL 2023 : రెచ్చిపోయి ఆడుతున్న చెన్నై.. గైక్వాడ్‌ హాఫ్‌ సెంచరీ

IPL 2023 : రెచ్చిపోయి ఆడుతున్న చెన్నై.. గైక్వాడ్‌ హాఫ్‌ సెంచరీ

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై దూకుడుగా ఆడుతోంది. మొదటి ఓవర్ నుంచే ఓపెనర్లు గైక్వాడ్, కాన్వే.. లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో పవర్ ప్లై ముగిసేసరికి సీఎస్కే.. వికెట్‌ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. మొదటి మ్యాచ్ లో 92 పరుగులతో అదరగొట్టిన గైక్వాడ్ ఈ మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు.

కాన్వేతో కలిసి మొదటి వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని జోడిస్తూ 31 బంతుల్లో 57 పరుగులు చేశాడు. కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రెచ్చిపోయి ఆడుతున్న గైక్వాడ్ ను రవి బిష్ నయ్ పెవిలియన్ చేర్చాడు.

8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే వికెట్‌ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన కాన్వే హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 20 బంతుల్లో 47 పరుగులు చేసిన కాన్వేను మార్క్ ఉడ్ ఔట్ చేశాడు.