రేషన్ ఏటీఎం లు వచ్చేశాయ్..రేషన్ షాపుల దగ్గర క్యూ గట్టాల్సిన పనిలేదు

రేషన్ ఏటీఎం లు వచ్చేశాయ్..రేషన్ షాపుల దగ్గర క్యూ గట్టాల్సిన పనిలేదు
  • ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సరికొత్త ప్రయోగం
  • 24 గంటల రేషన్ ఏటీఎం 
  • కార్డు నంబర్ ఎంటర్ చేస్తే చాలా బియ్యం మీ బస్తాలోకి 

రేషన్ ఏటీఎం లు వచ్చేశాయ్..ఇక రేషన్ దుకాణాల దగ్గర క్యూలో గంటలకొద్దీ నిలబడాల్సిన పనిలేదు.. 24 గంటలు అందుబాటులో రేషన్ బియ్యం సరఫర ఏటీఎం మెషీన్  అందుబాటులోకి వచ్చింది. ఏటీఎం కార్డు పెట్టి పిన్ నంబర్ ఎంటర్ చేసినట్లు.. రేషన్ ఏటీఎంలో మీ కార్డు వివరాలు ఎంటర్ చేస్తే చాలు.. మీ కోటా బియ్యం మీ బస్తాలో నిండుతాయి. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం సరికొత్తగా ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 24 గంటలు సేవలు అందించే రేషన్ ఏటీఎం ద్వారా  ఇప్పుడు ప్రజలకోసం రేషన్ బియ్యం అందిస్తోంది.. వివరాల్లోకి వెళితే..

రేషన్ కోసం ఇక గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం లబ్ధిదారుల కోసం 24 గంటల  రేషన్ ఏటీఎంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మెషీన్ లో సుమారు 2వేల500 కిలోల బియ్యం నిల్వ చేయవచ్చు. బియ్యాన్ని మెషీన్ లో నింపడం నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయడం వరకు మొత్తం ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరుగుతుంది.లబ్ధిదారులు తమకు కేటాయించిన రేషన్‌ను సులభంగా పొందేలా ఈ విధానాన్ని రూపొందించారు. దీంతో రేషన్ దుకాణాల దగ్గర రద్దీ తగ్గడంతో పాటు, సమయం కూడా ఆదా కానుంది.