మా గ్రామాల్లో మీ సెల్ ఫోన్ ట‌వ‌ర్లు పెట్టొద్దు.. పీకిపారేస్తున్న జ‌నం

మా గ్రామాల్లో మీ సెల్ ఫోన్ ట‌వ‌ర్లు పెట్టొద్దు.. పీకిపారేస్తున్న జ‌నం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామం సరైన మొబైల్, ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లకు  కనెక్ట్ అవ్వాలని కోరుకుంటాయి, కానీ  చత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామ ప్రజలైతే తమ గ్రామానికి వలస వచ్చే కొంగలను రక్షించుకోవడానికి  ఇంటర్నేట్ కనెక్టివిటీని కూడా వదులుకోవడానికి సిద్దపడ్డారు.  చత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలోని లచ్కెరా నివాసితులు టవర్ల నుండి వచ్చే రేడియేషన్  వలన వలస పక్షులపై ప్రభావం చూపుతుందని భయపడి తమ గ్రామ పరిసరాల్లో మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేయడానికి నిరాకరించారు.

దీనిపై ఆ గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ..  తమ గ్రామానికి  ఆసియా ఓపెన్‌బిల్ కొంగలు ప్రతి సంవత్సరం సందర్శిస్తాయి.  ఈ వలస పక్షులు గ్రామంలోని చెట్లపై గూడు కట్టుకుంటాయి. ఎవరూ కూడా వాటికి భంగం కలిగించరు.  తమ గ్రామంలోని 600 కుటుంబాలు ఉన్నాయి .. ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ వీక్ గా ఉన్న పరవాలేదు కానీ వలస వచ్చే పక్షులకు నష్టం కలిగించే ఉద్దేశం ఏ ఒక్కరికి లేదు. అందుకే తాము  ఏ మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్‌ను అనుమతించమని చెప్పారు.   

లచ్చెర గ్రామ పంచాయతీ మొబైల్ టవర్లను ఏ కంపెనీ ఏర్పాటు చేయకూడదని తీర్మానం చేసిందని,  ఎవరైనా పక్షులకు హాని కలిగించేలా చేస్తే వారికి రూ.1,000 జరిమానా విధిస్తామని తెలిపారు.    వేలాది కొద్దీ ఆసియా ఓపెన్‌బిల్ కొంగలు వర్షాకాలంలో లచ్చెరాకు వలస వచ్చి దీపావళి నాటికి వెళ్లిపోతాయి. ఈ పక్షులు సాధారణంగా భారత్,ఇతర ఆగ్నేయాసియా దేశాలలో కనిపిస్తాయి. ఈ కొంగలు బూడిదరంగు లేదా తెలుపు రంగులో  ఉంటాయి.  లచ్కెరా గ్రామంలోని చెట్లపై  ఈ కొంగలు గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తుంటాయి. 

ALSO READ :బీ అల‌ర్ట్.. గురు, శుక్ర వారాలు (20, 21 తేదీల్లో) హైద‌రాబాద్లో అతి భారీ వ‌ర్షాలు

ఈక్రమంలో ఊరిలోని చెరువులో  ఉన్న నీటి పాములు, కప్పలు, కీటకాలను తింటాయి.  సెల్ ఫోన్ టవర్స్ నుంచి ప్రమాదకర రేడియేషన్ వెలువడుతుందని.. పరిసర ప్రాంతాల ప్రజల హెల్త్  పై అది ఎఫెక్ట్ చూపిస్తుందని చాలా రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చాయి.. ఇలాంటి కారణాలతో సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటును స్థానికులు అడ్డుకున్న ఘటనలను మనం చూశాం.. కానీ తాజాగా జరిగిన ఈ ఘటన చాలా డిఫరెంట్ అని చెప్పాలి.