మోడీ బ్లాంక్‌ పేజ్‌ ఇచ్చారు.. నిర్మలా ఫిల్‌ చేస్తది

మోడీ బ్లాంక్‌ పేజ్‌ ఇచ్చారు.. నిర్మలా ఫిల్‌ చేస్తది
  • ఎకనామిక్‌ ప్యాకేజ్‌పై చిదంబరం కామెంట్‌
  • బ్లాంక్‌ పేజ్‌ చూసి బ్లాంక్‌ అయ్యాయని ఎద్దేవా

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ప్రకటించిన మెగా ప్యాకేజ్‌పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. మోడీ హెడ్‌లైన్‌తో కూడిన బ్లాంక్ పేపర్‌‌ ఇచ్చారని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దాన్ని నింపుతారని ఆయన విమర్శించారు. బ్లాంక్‌ పేజ్‌ చూసి తాను బ్లాంక్‌ అయిపోయాయని చిదంబరం ఎగతాళి చేశారు. “ నిన్న పీఎం మనకు హెడ్‌లైన్‌, బ్లాంక్‌ పేజి ఇచ్చాడు. దాని చూపి నేను బ్లాంక్‌ అయ్యాను. ఇక ఫైనాన్షియల్‌ మినిస్టర్‌‌ దాన్ని ఎలా ఫిల్‌ చేస్తారో చూడాలి. ఎకానమీలో ప్రభుత్వం తెచ్చే ప్రతి పైసా జాగ్రత్తగా లెకిద్దాం. ఎవరికి ఎంత ఇస్తున్నారో కూడా చూద్దాం. పేదరికం, ఆకలితో సొంత ఊళ్లకు నడిచి వెళ్లిన కార్మికులు ఏం ఆశిస్తున్నారో చూద్దాం. ముఖ్యంగా దేశంలో దారిద్ర్య రేఖకు దిగవున ఉన్న13 కోట్ల కుటుంబాలకు రియల్‌ మనీ కింద ఏం అందుతుందనే విషయాన్ని కూడా పరిశీలిద్దాం” అని చిదంబరం ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న ప్రజలకు ఊరట కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ‘ఆత్మ నిర్భర్‌‌ భారత్‌’ ప్యాకేజ్‌ ప్రకటించారు. కాగా.. దానికి సంబంధించి కేటాయింపులు ఏ రంగానికి ఎంత అనే విషయం నిర్మలా సీతారామన్‌ ఈ రోజు ప్రకటించనున్నారు.