సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3209 పోలింగ్ స్టేషన్లు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3209 పోలింగ్ స్టేషన్లు

సైబరాబాద్ కమిషనరేట్ ఎన్నికలకు  ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.  కమిషనరేట్ పరిధిలో ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో  విధులు నిర్వర్తించనున్నారు. సైబరాబాద్ పరిధిలో  చేవెళ్ల, మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాలు కీలకం.

సైబరాబాద్ పరిధిలో  మొత్తం 1218 పోలింగ్ ప్రాంతాలలో 3209 పోలింగ్ స్థానాలు ఏర్పాటు చేశారు అధికారులు.  90 పోలింగ్ ప్రాంతాల్లో 387 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా  గుర్తించారు.   పోలింగ్ స్టేషన్స్ కు 289 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. 

ఎన్నికల విధుల్లో మొత్తం 13 కంపెనీల CAPF బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. రెండు ఈవీఎం స్టోరేజ్ పాయింట్లు, ఆరు డిస్టిబ్యూషన్ పాయింట్ల దగ్గర పారామిలిటరీ బలగాలతో సెక్యూరిటీ..ఎన్నికల విధుల్లో 6 వేల మంది సివిల్ పోలీసులు, 867 మంది ఆర్మ్ డ్ పోలీసులు ఉండనున్నారు.  పోలింగ్ కేంద్రాల దగ్గర  క్యూ లైన్ సమస్యల పరిష్కారం కోసం NCC సహాయం తీసుకోనున్నారు.  అన్ని పోలింగ్ కేంద్రాలకు GEO ట్యాగింగ్  ఏర్పాటు చేశారు.  గుర్తించబడిన 1218  స్థానాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సైబరాబాద్ వాట్సప్ కంట్రోల్ ను ఏర్పాటుచేశారు.