హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ యువరాజు డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం (మార్చి 20) ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు డ్రగ్స్ దందాపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. డ్రగ్స్ నిర్మూలన బీజేపీకి ఇష్టం లేదా అని నిలదీశారు.
బీఆర్ఎస్ నేతల దగ్గర డ్రగ్స్ దొరికితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారని విమర్శించారు. ఇక, బీసీల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. బీజేపీలో బీసీలకు దక్కుతున్న గౌరవం ఏంటని ప్రశ్నించారు. సికింద్రాబాద్ సీటు బీసీ లీడర్ దత్తాత్రేయ నుంచి కిషన్ రెడ్డి లాక్కున్నారు.
అలాగే దత్తాత్రేయ గవర్నర్ పదవిని ఇంద్రసేనా రెడ్డి లాక్కున్నారని అన్నారు. బీసీ నేత దత్తాత్రేయకు బీజేపీలో గౌరవం ఏదని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తొక్కిపట్టిందే బీజేపీ అని అన్నారు. కాంగ్రెస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలకు పెద్ద పీట వేశామని చెప్పారు.
