కంట్రోల్ లోకి వచ్చిందా..: దేశంలోనే గ్యాస్ ఉత్పత్తి భారీగా పెరిగింది.. బండ బుకింగ్స్ తగ్గాయి

కంట్రోల్ లోకి వచ్చిందా..: దేశంలోనే గ్యాస్ ఉత్పత్తి భారీగా పెరిగింది.. బండ బుకింగ్స్ తగ్గాయి

పశ్చిమ ఆసియాలో  యుద్ధం కారణంగా చమురు ,గ్యాస్ సరఫరాపై ప్రభావం పడటంతో వంట గ్యాస్ కొరత ఏర్పడవచ్చనే భయంతో ప్రజలు పెద్ద ఎత్తున పానిక్ బుకింగ్ (ముందస్తు ఆందోళనతో బుకింగ్) చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ పరిస్థితి సద్దుమణిగిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం(మార్చి20)  తెలిపింది.

పెట్రోలియం ,సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ..వినియోగదారుల్లో ఆందోళన తగ్గిందని, పానిక్ బుకింగ్‌లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు.దేశంలో డొమెస్టిక్ ఎల్‌పిజి (వంట గ్యాస్) ఉత్పత్తిని 40 శాతం పెంచినట్లు తెలిపారు.గత వారం రోజుల్లోనే 11వేల300 టన్నుల కమర్షియల్ ఎల్‌పిజి (LPG) ని కస్టమర్లకు సరఫరా చేశామన్నారు. యుద్ధం కారణంగా ఇంధన సరఫరా సవాలుగా మారినప్పటికీ, దేశంలో ఎక్కడా గ్యాస్ నిల్వలు అయిపోలేదని దేశంలో గ్యాస్ ఉత్పత్తి గ్యాస్ ఉత్పత్తి భారీగా పెరిగిందని చెప్పారు. 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో  భవిష్యత్తులో గ్యాస్ లభించకపోవచ్చనే భయంతో అటు డొమెస్టిక్ కస్టమర్లరు ఇటు వ్యాపారస్తులు పెద్ద ఎత్తున సిలిండర్లను బుక్ చేసుకున్నారు.యుద్ధం కారణంగా దిగుమతులపై ఒత్తిడి ఉన్నప్పటికీ, దేశీయ ఉత్పత్తి పెంపు ద్వారా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని  పెట్రోలియం శాఖ చెప్పడం ప్రస్తుత పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.