Krishnamma Movie X Review: సత్యదేవ్ కృష్ణమ్మ మూవీకి అలాంటి టాక్.. మరి హిట్టు పడినట్టేనా?

Krishnamma Movie X Review: సత్యదేవ్ కృష్ణమ్మ మూవీకి అలాంటి టాక్.. మరి హిట్టు పడినట్టేనా?

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్య దేవ్(Satyadev) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నాడు సత్యదేవ్. ముందుగా చిన్న చిన్న పాత్రలతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు.. తరువాత సోలో హీరోగా మారాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత కృష్ణమ్మ(Krishnamma) అనే మాస్ అండ్ రస్టిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దర్శకుడు వీవీ గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ తో ఆసక్తి క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు(మే 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో.. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి ఆడియాన్స్ నుండి కర్షణమ్మ సినిమాకు ఎలాంటి టాక్ వస్తోందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

సోషల్ మీడియాలో కృష్ణమ్మ సినిమాకు యావరేజ్ టాక్ వస్తోంది. కృష్ణమ్మ సినిమా కథ బాగుంది. సత్యదేవ్ నటన సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టింది. మొదటి నుండి చివరివరకు చాలా ఎమోషనల్ గా సాగింది. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ మూవీ ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరికొందరేమో.. కథలో కొత్తదనం లేకపోయినా ప్రెజెంటేషన్ బాగుందని. రా అండ్ రెస్టింగ్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తుందని చెప్తున్నారు. ఓవర్ ఆల్ గా కృష్ణమ్మ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. ఈ టాక్ తో సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.