చిగురుపాటి జయరాం హత్య కేసు: పోలీసుల పాత్రపై సుప్రీం సీరియస్

చిగురుపాటి జయరాం హత్య కేసు: పోలీసుల పాత్రపై సుప్రీం సీరియస్

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హత్యలో పోలీసుల అధికారుల పాత్రపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసులపై ప్రధాన సెక్షన్ల కింద అభియోగాలు ఎందుకు మోపలేదని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే ఈ కేసులో పోలీసులను ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని .. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. తనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, పోలీసులపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారని ఆరోపించాడు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం…4 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ జనవరి మొదటివారానికి వాయిదా వేసింది.