‘బ్యాక్ టు బచ్ పన్’ పేరుతో ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ పెద్దవాళ్లందరినీ ఏకం చేసి వాళ్లతో చిన్నప్పుడు ఆడుకున్న గోలీలు, ఏడు పెంకులు, కర్రాబిల్లా , చుప్పా చుప్పి, పకడం పకిడి, లంగిడి తాంగ్, గోటీ, ఖోఖో లాంటి ఆటలన్నీ ఆడిస్తున్నాడు. కేవలం వాళ్లు ఆడడమే కాకుండా ఇవన్నీ తమ పిల్లలతో కూడా ఆడించమని చెప్తున్నాడు. ప్రతీ వారం ఒక్కో చోట ఈవెంట్ కండక్ట్ చేస్తూ పేరెంట్స్ కు చిన్ననాటి ఆటల ప్రాధాన్యతను, వాటి అవసరాన్ని తెలియజేస్తున్నాడు. ముందు పెద్దవాళ్లకు ఈ ఆటలు అలవాటు చేసి తద్వారా పిల్లలను కూడా ఈ ఆటల వైపు మళ్లిం చడమే నా ఉద్దేశం’ అంటున్నాడు సయ్యద్.
పెద్దల ద్వారా పిల్లలకు…..
నలుగురిని పోగు చేసి వాళ్లతో ఒకటి రెండు సార్లు ఆటలు ఆడించడం మాఉద్దేశం కాదు. ఈ ఆటలు డైలీ లైఫ్ లో అలవాటైపోవాలి. అందుకే ముందు మా వయసు ఉన్న పేరెంట్స్‌కి గుర్తు చేస్తే తర్వాత వాళ్లే తమ పిల్లలకు కూడా అలవాటు చేస్తారనే ఉద్దేశంతో ఈ ‘బ్యాక్ టు బచ్ పన్’ను ప్రారంభించాం. ఇక్కడకు వచ్చి న ప్రతీ ఒక్కళ్లకి ఈ ఆటల్ని పిల్లలతో కూడా ఆడించే ప్రయత్నం చేయమని చెప్తున్నాం . చాలా రోజుల తర్వాత ఈ ఆటలు ఆడడంతో చాలామంది ‘మాలో ఏదో కొత్త ఉత్సా హం వచ్చింద’ని, కొంతమంది ‘మా పిల్లలతో కూడా ఆడిస్తున్నాం ’ అని చెప్తున్నారు.
ఎంతో పాజిటివ్….
ఈ ఆటల వల్ల చాలా పాజిటివ్ ఉపయోగాలు ఉన్నాయి. కొంతమంది వారానికొకసారి ఈ ఆటలు ఆడితే ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సి న అవసరం లేదని కూడా చెప్తున్నారు. నిజంగా ఉద్యోగాలు చేస్తూ, సమయం కుదరని వాళ్లకు ఇలాంటి ఆటలతో ఎంతో కొంత శారీరక శ్రమ కలుగుతుంది. చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, మహిళలు వీటి పట్ల ఆసక్తి చూపుతున్నారు. త్వరలో వాళ్లకు కూడా ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం.
