ఖమ్మం టౌన్,వెలుగు : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో సోమవారం ఎర్ర బంగారానికి(తేజ మిర్చికి) క్వింటా రూ.22 వేలు ధర పలికింది.ఆదివారం సెలవు కావడంతో సోమవారం మార్కెట్ కు రైతులు 30 వేల బస్తా అమ్మకానికి తెచ్చారు.ఇంచుమించుగా తేజ మిర్చికి సమానంగా ఏసీ మిర్చి క్వింటా ధర రూ.21,500ల ధర పలికింది.ఈ ఏడాది పంట దిగుబడి తక్కువగా ఉండటం,మార్కెట్ కు బెస్ట్ క్వాలిటీ మిర్చి రావడం...ఇతర రాష్ట్రాల నుంచి అర్దర్లు రావడం, చైనా నుంచి అర్దర్లు రావచ్చనే ఆశభావంతో వ్యాపారులు ధర పెంచి మిర్చి కొనుగోళ్లు చేస్తున్నారు.
సోమవారం జండా పాట రూ.22 వేలు ధర పలికింది. ఒకటిన్నర ఇంచు సైజ్ లు రావడం,పండు,మెతక,గ్రేడింగ్ చేయకుండా మార్కెట్ కు రైతులు అమ్మకానికి తెచ్చిన మిర్చి క్వింటా రూ.17,500 ల నుంచి రూ.18 వేల కిందకు వ్యాపారులు కొనుగోలు చేశారు.

