రాహుల్‌ గాంధీకి కౌంటర్‌‌ ఇచ్చిన లడాఖ్‌ ఎంపీ

రాహుల్‌ గాంధీకి కౌంటర్‌‌ ఇచ్చిన లడాఖ్‌ ఎంపీ
  • చైనా ఆక్రమించిన ఇండియన్‌ టెరిటరీల లిస్ట్‌ ట్వీట్‌
  • అన్ని కాంగ్రెస్‌ హయాంలో జరిగాయన్న ఎంపీ

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్రాన్ని విమర్శస్తూ గత కొద్ది రోజులుగా ట్వీట్లు చేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి లడాఖ్‌ ఎంపీ జమ్యాంగ్‌ సెరింగ్‌ నమ్‌గ్యాల్‌ గట్టి కౌంటర్‌‌ ఇచ్చారు. చైనా ఆక్రమించిన మన టెరీటరీకి సంబంధించి లిస్ట్‌ పెట్టి ఎవరి హయాంలో ఆక్రమించుకున్నారనే విషయాన్ని చెప్పారు. “ ఆధారాలతో సహా నేను ఇచ్చిన రిప్లైతో రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఇప్పటికైనా జనాన్ని తప్పుదోవ పట్టించడం మానేస్తారని అనుకుంటున్నాను” అని జమ్యాంగ్‌ ట్వీట్‌ చేశారు. అవును చైనా ఇండియన్‌ టెరీటరీని ఆక్రమించింది అంటూ.. ఒక లిస్ట్‌ కూడా పెట్టారు. దాంతో పాటు ఆయన ఒక మ్యాప్‌ను కూడా జత చేశారు. కొద్ది రోజులుగా ఇండియా – చైనా బోర్డర్‌లో నెలకొన్న పరిస్థితిపై రాహుల్ గాంధీ కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. చైనా ఆర్మీ మన దేశంలోకి ఎంటరైందా లేదా అనే దానిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఎంపీ పోస్ట్‌ చేసిన లిస్ట్‌

  • అక్సాయి చిన్‌ (37,244 చ.మీ.) 1962లో కాంగ్రెస్‌ హయాంలో.
  • 2008 యూపీఏ టైమ్‌లో చుముర్‌‌ ఏరియాలోని టిట్‌ పంగ్నాక్‌, చబ్జీ వ్యాలీ (250మీ.)
  • డెమ్‌జోక్‌లోని జోరవర్‌‌ కోటను పీఎల్‌ఏ 2008లో నాశనం చేసింది. యూపీఏ పాలనలో 20102లోనే పీఏఏ అబ్జర్వింగ్‌ పాయింట్‌ను ఏర్పాటు చేసింది, 13 ఇళ్లు కట్టి, కొత్త డెమ్‌జోక్‌ కాలనీనీ సృష్టించింది.
  • డూమ్‌ చెలై (పురాతన ట్రేడ్‌ పాయింట్‌)ను మన దేశం కోల్పోయింది కూడా 2008– 09 యూపీఏ ప్రభుత్వ హయాంలోనే.