క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు గ్రేటర్ ముస్తాబైంది. సిటీలోని చర్చిలను క్రిస్టియన్లు అందంగా ముస్తాబు చేశారు. భారీ క్రిస్మస్ ట్రీలు, కలర్‌ఫుల్ లైటింగ్‌తో డెకరేట్ చేశారు. పండుగ సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాల్స్, మార్కెట్లలో మంగళవారం సాయంత్రం క్రిస్మస్షాపింగ్ సందడి నెలకొంది. గ్రేటర్ ప్రజలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఇలంబరితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
