వెంకట్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకుడు. హెబ్బాపటేల్, సలోని, నటాషా, అలీ, సుమన్, రవి వర్మ , సుభాశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 8న సినిమా విడుదల కానుంది. శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. విలన్‌గా శ్రీహరి పైలా అనే కొత్త ఆర్టిస్ట్‌ను పరిచయం చేస్తున్నాం. డైరెక్టర్ రాజ్ నన్ను యాక్షన్ హీరోలా చూపించారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని అన్నాడు.
వెంకట్‌తో జర్నీ హ్యాపీగా ఉంటుందని నటుడు అలీ అన్నారు. డైరెక్టర్ రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం వెంకట్ ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు. కచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది’ అని అన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ మణి జిన్న, డిఓపీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
