సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (74) ధనాధన్ బ్యాటింగ్‌తో ఊపుతెచ్చినా బౌలింగ్‌లో పూర్తిగా ఫెయిలై 220 టార్గెట్‌ను కూడా కాపాడుకోలేకపోయింది. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది.
ముల్లన్‌పూర్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మళ్లీ నిరాశే. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బాల్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 74) ధనాధన్ బ్యాటింగ్‌తో పవర్‌ప్లేలోనే వంద రన్స్ రాబట్టినా అదే స్పీడును కొనసాగించలేక.. బౌలింగ్‌లో తేలిపోయి 220 టార్గెట్‌ను కూడా కాపాడుకోలేక ఐపీఎల్‌లో మూడో ఓటమితో డీలా పడింది. ఇంకోవైపు భారీ టార్గెట్స్ ఛేజింగ్‌లో తమకు తిరుగేలేదని నిరూపించిన పంజాబ్ కింగ్స్ లీగ్‌లో మూడో విక్టరీ అందుకుంది.
శ్రేయస్ అయ్యర్ (33 బాల్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు ప్రియాంశ్ ఆర్య (20 బాల్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 57), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (25 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51) ఫిఫ్టీలతో విజృంభించడంతో శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది.
తొలుత సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 219/6 స్కోరు చేసింది. అభితో పాటు హెన్రిచ్ క్లాసెన్ (39), ట్రావిస్ హెడ్ (38), ఇషాన్ కిషన్ (27) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో పంజాబ్ 18.5 ఓవర్లలో 223/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. శివాంగ్ కుమార్ మూడు వికెట్లు తీసినా మిగతా బౌలర్లు తేలిపోయారు. శ్రేయస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
అభి జోరు.. మిడిల్ బేజారు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ స్టార్టింగ్‌లో దుమ్మురేపింది. అభిషేక్ శర్మ బౌలర్లను షేక్ చేయడంతో పవర్ ప్లేలోనే వంద రన్స్ చేసింది. బార్ట్‌లెట్ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన అభి.. అర్ష్‌దీప్ వేసిన మూడో ఓవర్లో 4, 4, 6, 6తో టాప్ గేర్ అందుకున్నాడు. యాన్సెన్ బౌలింగ్‌లో హెడ్ 4, 6, 4 కొట్టగా... వైశాక్ వేసిన ఐదో ఓవర్లో అభి నాలుగు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించి 18 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఈ దెబ్బకు పవర్ ప్లేను సన్‌రైజర్స్ 105/0 స్కోరుతో ముగించింది. ఓపెనర్ల జోరు చూస్తే రైజర్స్ రికార్డు స్కోరు చేసేలా కనిపించింది.
కానీ, ఫీల్డింగ్ మారిన తర్వాత పంజాబ్ గొప్పగా పుంజుకుంది. ముఖ్యంగా మీడియం పేసర్ శశాంక్ సింగ్ కట్టుదిట్టమైన స్పెల్‌తో కట్టడి చేశాడు. తొమ్మిదో ఓవర్లో మూడు బాల్స్ తేడాలో హెడ్, అభిషేక్ ఇద్దరినీ ఔట్ చేసిన హైదరాబాద్ స్పీడుకు బ్రేకులు వేశాడు. మరో ఎండ్‌లో స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో రన్‌రేట్ తగ్గిపోయింది. కెప్టెన్ కిషన్, క్లాసెన్ ధాటిగా ఆడలేకపోయారు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో యాన్సెన్ పట్టిన అద్భుత క్యాచ్‌కు ఇషాన్ వెనుదిరిగాడు.
మరోవైపు హిట్టర్ క్లాసెన్ స్లో బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది. చహల్ వేసిన 17వ ఓవర్లో 6, 4తో ఇన్నింగ్స్‌కు మళ్లీ ఊపు తెచ్చే ప్రయత్నం చేసిన అనికేత్ వర్మ (18) తర్వాతి బాల్‌కే రనౌటయ్యాడు. తన 28వ బాల్‌కు యాన్సెన్ బౌలింగ్‌లో క్లాసెన్ ఎట్టకేలకు ఓ సిక్స్ కొట్టగా.. అర్ష్‌దీప్ వేసిన 19వ ఓవర్ ఫస్ట్ బాల్‌కే సిక్స్ బాదిన సలీల్ అరోరా (9) మరో షాట్‌కు ట్రై చేసి బార్ట్‌లెట్‌కు క్యాచ్ ఇచ్చాడు. లాస్ట్ ఓవర్లో క్లాసెన్‌ను ఔట్ చేసిన బార్ట్‌లెట్ ఐదు రన్స్ మాత్రమే ఇచ్చాడు.
పంజా విసిరింది..
ఓపెనర్ల మెరుపులకు తోడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఖతర్నాక్ బ్యాటింగ్‌తో భారీ టార్గెట్‌ను పంజాబ్ ఈజీగా ఛేజ్ చేసింది. ఫస్ట్ ఓవర్లోనే హర్ష్ దూబేకు ప్రియాంశ్ రెండు ఫోర్లు, సిక్స్‌తో స్వాగతం పలకగా.. ఉనాద్కట్, ఈషాన్ ఓవర్లలో రెండేసి ఫోర్లు, సిక్సర్లతో ప్రభ్‌సిమ్రన్ జోరు చూపెట్టాడు. 4వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన ప్రభ్ ఇచ్చిన టఫ్ రిటర్న్ క్యాచ్‌ను బౌలర్ ఉనాద్కట్ డ్రాప్ చేశాడు. ఈషాన్ బౌలింగ్‌లో 6, 4తో మళ్లీ వేగం పెంచిన ప్రియాంశ్... హర్షల్ పటేల్ వేసిన ఆరో ఓవర్లో వరుసగా 6, 6, 4, 4తో స్టేడియాన్ని హోరెత్తించి 16 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
ఓపెనర్ల ధాటికి పవర్ ప్లేలోనే పంజాబ్ 93 రన్స్ రాబట్టింది. ఈ దశలో శివాంగ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన వరుస ఓవర్లలో ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్‌తో పాటు కూపర్ కనోలి (11)ని ఔట్ రైజర్స్‌ను తిరిగి రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. మధ్యలో నితీశ్ రెడ్డి పొదుపుగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ కాస్త వెనుకంజ వేసినట్టు కనిపించింది. కానీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రైజర్స్‌కు చాన్స్ ఇవ్వలేదు.
12వ ఓవర్లో వరుసగా 6,4తో గేర్ మార్చిన అతను హర్షల్ పటేల్ వేసిన 15వ ఓవర్లో 6, 4, 6తో విజృంభించాడు. ఆపై ఈషాన్ మలింగ బౌలింగ్‌లో 4, 4, 6 కొట్టిన అతను ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో పాటు పంజాబ్ విజయం ఖాయం చేశాడు. అయ్యర్‌కు సపోర్ట్ ఇచ్చిన నేహల్ వధేరా (14)ను హర్ష్ దూబే ఔట్ చేసినా.. ఉనాద్కట్ బౌలింగ్‌లో సిక్స్, అభిషేక్ వేసిన 19వ ఓవర్లో ఫోర్‌తో శశాంక్ సింగ్ (16 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
సన్‌రైజర్స్: 20 ఓవర్లలో 219/6 (అభిషేక్ 74, క్లాసెన్ 39, శశాంక్ సింగ్ 2/20)
పంజాబ్: 223/4 (శ్రేయస్ 69 నాటౌట్, ప్రియాంశ్ 57, శివాంగ్ 3/33).
