హైదరాబాద్, వెలుగు: ఆర్టిజన్ల సమ్మె కారణంగా విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సబ్‌స్టేషన్ల వద్ద కన్‌స్ట్రక్చన్ ఇంజినీర్లు, సబ్‌ఇంజినీర్లకు డ్యూటీలు వేయాలని చీఫ్ఇంజినీర్లను ఎస్‌పీడీసీఎల్ సీఎండి జితేశ్ పాటిల్ ఆదేశించారు. ఆర్టిజన్‌ల సమ్మెపై శనివారం ఆయన హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్ ఆఫీస్నుంచి అన్ని జిల్లాల చీఫ్ ఇంజినీర్లతో టెలీ కాన్ఫరెన్స్‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిజన్లసమ్మె ప్రభావాన్ని, విద్యుత్ సరఫరాకు కలిగే ఇబ్బందులను ఫీల్డ్నుంచి అడిగి తెలుసుకున్నారు.
నిరంతర విద్యుత్ సరఫరాకు క్షేత్ర స్థాయిలో తీసుకున్న చర్యలను లోకల్ఆఫీసర్లు సీఎండీకి వివరించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సర్కిల్‌లో ఉన్న ఓఅండ్ఎం స్టాఫ్ , సబ్ ఇంజినీర్లు, ఎమ్‌ఆర్‌టీ, డీపీఈ, కన్‌స్ట్రక్చన్ ఇంజనీర్లకు షిఫ్ట్ పద్ధతిలో సబ్‌స్టేషన్లు వద్ద డ్యూటీలు వేయాలని ఆదేశించారు. ఫీల్డ్ లెవెల్‌లో మొత్తం ఓఅండ్ఎం మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. విద్యుత్ అంతరాయల గురించి ఎప్పటికప్పుడు తనకు తెలియచేయాలని ఎస్‌ఈలను ఆదేశించారు.
