కొరియన్ కనకరాజు నుంచి కొత్త పాట విడుదల సిద్ శ్రీరామ్ పాడిన కంసామ్నీడా సాంగ్ ఆకట్టుకుంటోంది

కొరియన్ కనకరాజు నుంచి కొత్త పాట విడుదల సిద్ శ్రీరామ్ పాడిన  కంసామ్నీడా సాంగ్ ఆకట్టుకుంటోంది

వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. శనివారం ఈ చిత్రం నుంచి ‘‘కంసామ్నీడా (కొరియన్‌‌లో థ్యాంక్స్‌‌) ఎట్టా పుట్టావే భూమ్మీద..” అనే పాటను విడుదల చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటను సిద్‌‌ శ్రీరామ్ పాడాడు. ‘‘నీ వేళ్లే పట్టి అందం నడక నేర్చేనే.. నీ శ్వాసే చుట్టి గాలికి ఊపిరి వచ్చేనే.. సన్నజాజి తీగే సన్యాసై పోయే..

చిన్ని నడుము చేసే వయ్యారాల ఆ మాయే.. ముద్దు ముద్దు గున్నదే అర్థం కాని నీ భాషే.. కోయిలమ్మ కూడా కొరియన్‌‌ లోనే కూసే..” అంటూ హీరోయిన్‌‌ అందచందాలు,  గుణగణాలను గురించి హీరో పొగుడుతున్నట్టుగా సాగిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు.  ఇండో కొరియన్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో  హారర్, కామెడీ కలయికతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్ సత్య కీలకపాత్ర పోషిస్తున్నాడు.  యూవీ  క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌‌టైన్‌‌మెంట్ సంస్థలు కలిసి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.