పీఎంకేర్‌ ఫండ్‌కు CISF రూ.16 కోట్ల విరాళం

పీఎంకేర్‌ ఫండ్‌కు CISF రూ.16 కోట్ల విరాళం

ఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాడుతున్న కేంద్ర‌ ప్రభుత్వానికి మద్దతుగా ఇప్ప‌టికే ప‌లువురు విరాళాలు అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) రూ. 16 కోట్లు పీఎంకేర్స్‌ ఫండ్ ‌కు విరాళంగా అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఒక రోజు వేతనం రూ.16,23,82,357లను విరాళంగా ప్రకటించింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేష్‌ రాజన్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు అందజేశారు.

కరోనా వైరస్‌తో దేశంలో ఇప్పటివరకు 1568 మంది బాధితులు మరణించారు. దేశవ్యాప్తంగా 46,433 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 3900 కరోనా కేసులు నమోదవగా, 193 మంది మరణించారు.