తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్యను పెంచిన సీజేఐ

V6 Velugu Posted on Jun 09, 2021

తెలంగాణ  హైకోర్టులో జడ్జిల సంఖ్య 75% పెంచుతూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకున్నారు. జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచుతూ ఆమోద ముద్ర వేశారు. న్యాయ‌మూర్తుల సంఖ్య‌ను పెంచాల‌ని హైకోర్టు రెండేళ్లుగా  సుప్రీంకోర్టును కోరుతోంది. కేంద్ర న్యాయ‌శాఖ తుది ఆమోదం తర్వాత జ‌డ్జిల సంఖ్య అధికారికంగా పెర‌గ‌నుంది. జ‌డ్జిల సంఖ్య‌ను పెంచ‌టంపై తెలంగాణ న్యాయ‌వాదులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Tagged cji, Telangana High Court, increases judges number

Latest Videos

Subscribe Now

More News