Rathnam Movie X Review: రత్నం ట్విట్టర్ రివ్యూ.. యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?

Rathnam Movie X Review: రత్నం ట్విట్టర్ రివ్యూ.. యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?

తమిళ యాక్షన్ హీరో విశాల్(Vishal), మాస్ డైరెక్టర్ హరి(Hari) కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ రత్నం(Rathnam). అవుట్ అండ్ అవుట్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించారు. రాక్ స్టార్ దెవొ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా ఉండటంతో.. సినిమా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేశారు మేకర్స్. ఇక పలు వివాదాల మధ్య ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది రత్నం మూవీ. ఇప్పటికే చాలాచోట్ల ప్రీమియర్ షోస్ పడటంతో.. సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి రత్నం సినిమాపై ఆడియన్స్ రియాక్షన్ ఏంటి అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో రత్నం సినిమాకు మిక్సుడ్ టాక్ వస్తోంది. కొంతమంది సినిమా బాగుంది అంటే.. మరికొందరేమో రొటీన్ స్టోరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా వచ్చిన రత్నం మూవీ మాస్ ప్రేక్షకులకు, విశాల్ ఫ్యాన్స్ కు తప్పా.. సామాన్య ప్రేక్షకులకు నచ్చే అవకాశం తక్కువ అని చెప్తున్నారు. కథ, కథనం పెద్దగా ఆకట్టుకోలేదని, యాక్షన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టారని, మిగతా అంతా రొటీన్, రొటీన్ అని కొంతమంది అంటుంటే... మాస్ పర్ఫార్మెన్స్ తో విశాల్ అదరగొట్టేశాడని, సినిమా సూపర్ హిట్ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క.. విశాల్, ప్రియా భవాని శంకర్ పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా.. వాటిని నిలబెట్టే కథ లేదని చెప్పుకుంటున్నారు. మొత్తంగా సోలోగా వచ్చిన రత్నం మూవీకి ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. మరి ఈ టాక్ తో సినిమా ఎలాంటి రిజల్ట్ ను దక్కించుకుంటుందో చూడాలి.