టీకాంగ్రెస్ లో ఆధిపత్యపోరు.. రేవంత్ పై సీనియర్ల మండిపాటు

టీకాంగ్రెస్ లో ఆధిపత్యపోరు.. రేవంత్ పై సీనియర్ల మండిపాటు

కాంగ్రెస్ లో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వర్సెస్ రేవంత్ టీమ్ గా చీలిపోయింది. కొత్త కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చినోళ్లకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని సీనియర్లు గుస్సా మీదున్నారు. వలస నేతలంటూ సీనియర్లు చేసిన కామెంట్స్ కు కౌంటర్ గా.. కొత్త కమిటీల్లో పదవులకు 13మంది రాజీనామా చేశారు.

రేవంత్ వర్గం రాజీనామాతో కాంగ్రెస్ లో సంక్షోభం మరింత ముదిరినట్లు అయింది. అయితే 13 మంది నేతల రాజీనామా విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు రేపు మరోసారి సమావేశం కానున్నారు.