ఆ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు.. పగోడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది.. తల్లి చనిపోయింది. నలుగురు చిన్న పిల్లలు తల్లిలేని వారయ్యారు. తండ్రి పనిచేస్తేనేగానీ పూటగడవదు.. అలాంటి పరిస్థితో ఆ బాలికపై పడింది భారం.. చిన్న వయసులో పెద్ద బాధ్యత.. నలుగురు తోడబుట్టిన వారిని సాకుతూనే తాను చదువుకుంటోంది. కుటుంబానికి అండగా ఉంటోంది. ఏడాదిన్నర తమ్ముడిని ఎత్తుకొని స్కూల్ కు వెళితే కొత్తగా వచ్చిన టీచర్ ఆమెను మందలించినపుడు తన పరిస్థితిని తలచుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తున్న హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను కదిలించింది.
పిల్లలు పాఠశాల, స్నేహితులు,తమ కలల ప్రపంచంలో మునిగి తేలే వయసులో పెద్ద బాధ్యతలను మోయడం అంటే అంత సులభం కాదు. పదిహేనేళ్ల వయసులో చదువుకుంటూనే తన ముగ్గురు చెళ్లెళ్లను, తమ్ముడిని పెంచుతూ, కుటుంబ భారాన్ని మోస్తున్న నేపాల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని అస్మిత తమాంగ్ హార్ట్ టచింగ్ స్టోరీకి సంబంధించిన ఓ వీడియో నెటిజన్ల హృదయాలను దోచుకుంటోంది.
►ALSO READ | ఒక గంటకు ఎంత మంది చనిపోయితున్నారో తెలుసా.. మన ఇండియాలోనే నిమిషానికి ఎంత మంది అంటే..
అస్మిత తమాంగ్ తన ధైర్యం, పోరాట పటిమ ,కర్తవ్య నిష్ఠతో అందరి మనసులనూ గెలుచుకుంది. పిల్లలు పాఠశాల, స్నేహితులు,తమ కలల ప్రపంచంలో మునిగి తేలే వయసులో, అస్మిత తన ముగ్గురు తోబుట్టువులను సంరక్షించి, పెంచే బాధ్యతను తన భుజాలపై మోస్తోంది. అంతేకాకుండా, ఆమె తన చదువును కూడా కొనసాగిస్తూనే, తన కుటుంబానికి బలమైన అండగా నిలుస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. 9వ తరగతి విద్యార్థిని అస్మిత తమాంగ్ తన ఒకటిన్నర సంవత్సరాల తమ్ముడిని ఒడిలో పెట్టుకుని పాఠశాలకు వచ్చిన దృశ్యాలు కనిపిస్తుననాయి. తల్లి చనిపోయిన తర్వాత, అస్మిత తన తోబుట్టువుల బాధ్యతను తీసుకుంది. టీచర్ వివరాలు అడిగినప్పుడు ఆమె తరగతి గదిలోనే ఏడుస్తూ కుప్పకూలిన హార్ట టచింగ్ సీన్స్ కంటతడిపెట్టిస్తున్నాయి. తండ్రి పనికి వెళ్లడంతో పిల్లలను చూసుకునేవారు ఎవరూ లేక అస్మిత తన తమ్ముడిని ప్రతి రోజూ పాఠశాలకు తీసుకువస్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు అస్మిత ధైర్యం, ఓర్పు, పట్టుదలను మెచ్చుకుంటున్నారు. ‘‘నిజంగా, సోదరి అంటే తల్లితో సమానం.’’ అస్మిత నిరూపించిందని అభినందిస్తున్నారు. అయితే కొందరు సామాజిక బాధ్యత అంశాన్ని లేవనెత్తారు. సమాజం తన బాధ్యతను నెరవేర్చిందా? ఇంతటి అమాయక పిల్లల సంరక్షణ కోసం మన నుంచి పన్నులు వసూలు చేసే ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించారు.
सोशल मीडिया पर 9वीं कक्षा की छात्रा अस्मिता तामांग की भावुक कहानी का एक वीडियो तेजी से वायरल हो रही है। वायरल दावों के अनुसार, अस्मिता पढ़ाई करने के साथ-साथ अपने तीन छोटे भाई-बहनों की अकेले परवरिश कर रही है और परिवार का खर्च चलाने के लिए कड़ा संघर्ष कर रही है। गहन जांच के… pic.twitter.com/kZ7ONjOaNX
— 𝐍𝐚𝐲𝐚𝐛 𝐀𝐡𝐦𝐚𝐝 (@Haji_Nayab_786) May 29, 2026
