అబిడ్స్, వెలుగు: శాస్త్రీయ నృత్యాన్ని భావితరాలకు అందించడం అత్యంత అవసరమని పూర్వ ఆదాయపన్ను ప్రిన్సిపాల్ చీఫ్ కమిషనర్ బీవీ గోపినాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో “ది డాన్స్ ఇండియా తెలుగు స్టేట్స్ అవార్డ్స్-2026” వేడుక ఘనంగా జరిగింది.
ముఖ్య అతిథిగా బీవీ గోపినాథ్ మాట్లాడుతూ.. డాన్స్ ఇండియా సంస్థ గత పదేండ్లుగా నృత్యోత్సవాలు నిర్వహిస్తూ కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించడం అభినందనీయమన్నారు. ఈ వేడుకలో ప్రముఖ నాట్య గురువులు డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రిలకు “సిల్వర్ ఘుంగ్రూ అవార్డ్స్” ప్రదానం చేశారు. అలాగే మరికొందరు ప్రముఖులకు “ది డాన్స్ ఇండియా తెలుగు స్టేట్స్ అవార్డ్స్-2026” అందజేసి ఘనంగా సత్కరించారు.
