హైదరాబాద్ లో ఇవాళ(బుధవారం) రాత్రి ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. జగ్‌నే కి రాత్ కార్యక్రమంలో భాగంగా మస్లింలు ఇవాళ రాత్రి ప్రార్ధనలు చేయనున్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా , రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారుఝాము వరకు గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లైఓవర్, లంగర్‌హౌస్, పివిఎన్‌ఆర్ ఫ్లైఓవర్లు మినహా నెక్లెస్‌రోడ్డుతో సహా అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు దీనికి సహకరించి…ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
