ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం ఎయిర్ పోర్ట్ శనివారం ( ఆగష్టు 1 ) ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. భోగాపురం ఎయిర్ పోర్టుకు కొబ్బరికాయ కొట్టింది తామే, గుమ్మడికాయ కొట్టింది తామేనని అన్నారు.
అల్లూరి పోరాటాన్ని దేశం ఎప్పటికి మరిచిపోదని... ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికామని అన్నారు. ఎయిర్ పోర్టుకు రైతులు సహకరించారని...సహకరించిన ప్రతి రైతులు పాదాభివందనాలని అన్నారు సీఎం చంద్రబాబు.
రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదని.. ప్రగతిని ఇచ్చారని అన్నారు చంద్రబాబు. రెండేళ్ల క్రితం రాష్ట్రం విధ్వంసమై ఉందని... భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర కాలాలకు సాకారమని అన్నారు. ఉత్తరాంధ్రను హేళన చేసినవారు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు చంద్రబాబు.
ఏపీకి ప్రాణం పోసిన వ్యక్తి మోడీ అని.. విశాఖ ఉక్కును నిలబెట్టింది మోడీనే అని అన్నారు. విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసింది మోడీనే అని...పోలవరాన్ని పూర్తి పూర్తి చేస్తుంది మోడీనే అని అన్నారు చంద్రబాబు.అమరావతి రాజధానికి నిధులు ఇచ్చింది మోడీనే అని...2027లో పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామని అన్నారు చంద్రబాబు.
