గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సర్కారు నిర్ణయం

గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సర్కారు నిర్ణయం

హైదరాబాద్: రాష్ట్రం లోని ప్రతి గ్రామంలో ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’  ఏర్పాటు చేయాలని సీఎం కేసిఆర్ నిర్ణయించారు. బుధవారం  ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.   రాష్ట్ర వ్యాప్తంగా 19వేల గ్రామాలు, 5 వేల వార్డులు ఉండగా... వాటన్నింటిలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  జూన్ 2న  రాష్ట్ర అవిర్భావ దినోత్సవం  సందర్భంగా గతంతో ఎంపిక చేసిన గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలన్నారు.  భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడేందుకు ఈ క్రీడా ప్రాంగణాలు ఉపయోగపడతాయన్నారు. క్రీడల వల్ల ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా లభిస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. వీలైనంత త్వరగా క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మొద్దు

అభిమాని లేఖకు ధోని ఫిదా..రిప్లై ఏమిచ్చాడో తెలుసా