
- కేబినెట్ తో పాటు వచ్చి క్యాంపులు పెడ్తా
- దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తెస్తం
- ఒకటిన్నరేండ్లలో ఆదిలాబాద్ కాశ్మీర్‌లా చేస్త
- బీజేపోళ్లకు ఎలక్షన్లు రాగానే హిందూ, ముస్లిం , పాకిస్థాన్, గుళ్లు గుర్తొస్తయి
- దేశ ప్రధాని ప్రజలను విడదీస్తరా?
- నిర్మల్ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్
ఆదిలాబాద్/నిర్మల్, వెలుగు:‘‘భూముల సమస్యలు పరిష్కకరించేందుకు ప్రతి జిల్లాకు నేనే వచ్చి రెండుమూడ్రోజులు ఉంటా. బర్రున వచ్చి బుర్రున పోవుడు కాదు. నా వెంబడి చీఫ్ సెక్రటరీ నుంచి మంత్రివర్గం అంతా వస్తది. ఒక్కో జిల్లాలో క్యాం పు పెట్టి భూముల సమస్యలన్నింటినీ తీరుస్తం. దేశానికే ఆదర్శమైన రెవెన్యూ విధానాన్నితెస్తం’’ అని సీఎం కేసీఆర్ ప్రకటిం చారు.రైతులంతా నెల, రెండు నెలలు ఓపిక పట్టాలని, ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని సూచించారు. గ్రామంలో ఉండేరైతు సమన్వయ సమితులు, రైతు పెద్దలు..ఆ ఊరికి కథానాయకులై, ధర్మంగా ఎవరిభూమికి వాళ్లకు వచ్చేటట్టుగా చూడాలనిచెప్పారు . ‘‘రైతులు ఎమ్మార్వో ఆఫీస్ కు తిరిగే ఖర్మ లేకుండా, ఎవ్వరికీ లంచం ఇచ్చే అవసరం లేకుండా చేస్తం. బ్యాం కులోనుకు కూడా పాస్ బుక్ ఇచ్చే అవసరం లేకుండా, గంటలోపల్నే మ్యుటేషన్ చేసి సర్టిఫికెట్ ఇచ్చేలా చట్టం తెస్తం’’ అని చెప్పారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఆదిలాబాద్ పచ్చబడ్తది
చాలా కష్టపడి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నం .మనం కోరుకున్న అభివృద్ధి మార్గం పట్టినం.గతంలో కరెంట్ బాధలుండె . అవన్నీ పోయినయ్ . భవిష్యత్తు లోకూడా రావు. దేశంలో అత్యధికంగా తలసరి విద్యుత్ వాడుకునే రాష్ట్రాల్లో మన రాష్ట్రం నంబర్ 1 స్థానంలోఉంది. దేశంలో రైతులకు 24 గంటలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ముందున్నం . పెన్షన్లు పెంచుకున్నం . దేశంలో 18,20 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నరు. వాళ్లను కూడాఎవ్వలు పట్టించుకోలే. దేశంలో బీడీ కార్మికు లకు కూడా పెన్షన్ ఇచ్చి ఆదుకునే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా తెచ్చుకున్నం . ఇవన్నీ మీ కండ్ల ముందే ఉన్నయి . వీటన్నింటి మించి పరిపాలన సంస్కరణలు చేసుకున్నం .తెలంగాణ రాకుంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే,ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా లేకుంటే ఈ నిర్మల్ గడ్డ జిందగీల కూడా జిల్లా కాకుండె . భగవంతుడు ఇచ్చి న సంపద చాలా ఉంది ఆదిలాబాద్‌లో. తెలంగాణకు ఇది కాశ్మీర్ లాంటిది. గొప్ప సారవంతమైన భూములున్నయి . వాటన్నింటికీ నీళ్లు రావాలె. పాత ప్రాజెక్టులను బాగుచేసినం. కొత్తవి చేపట్టాం . ఎస్సారెస్పీ నుంచి 50 వేల ఎకరాలకు నిర్మల్ , ముథోల్ కు నీళ్లు ఇచ్చే పనులు పూర్తయితున్నయి . తమ్మిడిహెట్టి ప్రాజెక్టు నుంచి అక్కడ కూడా 2 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తయి . మొత్తమ్మీద ఒకటీ ఒకటిన్నర ఏండ్లలోనే ఆదిలాబాద్ కాశ్మీర్ లాగనే పచ్చని పంటచేలతో కళకళలాడుతది.
భూముల బాధలు తీరుస్త
గిరి జనుల పోడు భూముల సమస్యతోపాటు గిరిజనేతరుల బాధలు కూడా ఉన్నయి . మైదాన ప్రాంతాల్లోకూడా రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నయి . ఈ మంచిర్యాలలనే ఒక రైతు ఫేస్‌బుక్ ల మాట్లాడితే అతని సమస్య నేను పరిష్కారం చేసిన. నేను ఏదైనా చేస్తే మొండిగా పనిచేస్త. ఈ జూన్ తర్వాత దేశమే ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం తెస్తం. గిరిజన, గిరిజనేతర, పోడు, మైదాన భూములుకావచ్చు. ఒక్కొక్క గుంటలెక్క తేలాలె. ఎవరి భూమిఏందో తేలడమే కాదు.. భూమిపై పూర్తి యాజమాన్య హక్కు(కంక్లూజివ్ టైటిల్ ) కల్పిస్తం. ఇది ఇండియాల ఎక్కడా కూడా లేదు. రెండోది.. పహాణీ నకల్ మార్చేసినం. కొన్ని దోపిడీ శక్తులు రైతులను దోచుకొని తినేందుకు అందులో 36 కాలమ్స్ పెట్టారు. అవన్నీ తీసేసినం.
ఎలక్షన్లు రాగానే గుర్తొస్తయా?
ఈ మోడీ 2014 ఎలక్షన్ల ఏం చెప్పిండు? నల్లధనం ఏ దేశంల ఉన్నా, పాతాళంల ఉన్నా తెస్తమని చెప్పిండు. ఇంటికి 15 లక్షలు మీ ఖాతాల వేస్తమని చెప్పిండ్రు. 15 రూ పాయలన్నా ఇచ్చిండ్రా? ఇప్పుడు మళ్లా ఏ మొఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నరు?సిగ్గూ లజ్జా అవసరం లేదా? ఒక్కమాట మీదనన్నా ఉండద్దా? 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తమని చెప్పిండ్రు. కోటి మందికైనా ఇచ్చిండ్రా? ఎలక్షన్లు రాగానే పాకిస్థాన్, హిందువులు, ముస్లింలు అంటూఓ లంగ పంచాయితీ పెట్టాలె. ఓట్లు దండుకోవాలె.అవతల పడాలె. ఎలక్షన్లు రాంగనే రామాలయం,హిందువులు, పాకిస్థాన్ గుర్తస్తదా? ప్రజల సమస్యలు లేవా? పేదరికం లేదా? ప్రధానిగా ఉన్న వ్యక్తిప్రజల్ని విడదీసి హిందువులు, ముస్లింలు అని మాట్లాడవచ్చునా? ఇది ధర్మమేనా? అన్ని మతాలవారు ప్రశాంతంగా నివసించే గడ్డ మనది. మసీదుకు పోయేటోడు మసీదుకు పోతుండు. గుడికి పోయేటోడు గుడికి పోతుండు. చర్చికి పోయేటోడు చర్చికి పోతున్నడు. ఎవడి దండం వాడు పెట్టుకుం టున్నడు. ఈలంగ పంచాయతీలు ఎవనికి పనికత్తయి ? కడుపునింపుతయా? కాలు నింపుతయా? ఏ మతమైనా అందరి రక్తం ఎర్రగనే ఉంటది. సావైనా, సంతోషమైనా అందరికీ ఒకటే. ఏ మతంవాళ్లయినా సచ్చి పోతేఏడుస్తరు కదా? ఏ మతపోయిన కైనా గిచ్చితే నొప్పి పెట్టదా ? అందరం ఒకటే. కానీ ఈ లంగ పంచాయతీలు పెట్టి.. సమాజాన్ని డివైడ్ చేయాలె. సెక్యులర్‌భావాలతో బతికే ప్రాంతాలను కలుషితం చేయాలె.ఫేస్‌బుక్కుల పెద్ద హోరు.. హిందువులు, దేవాలయాలు. మేం కాపాడ్తలేమా దేవాలయాలు? ప్రతి ఒక్కని ఇంట్ల దేవుని పటమైనా ఉంటది. ఆఖరికి క్యాలెండర్‌అన్నా ఉంటది. పొద్దుగాల.. ఎంత సన్నాసైనా దేవునికిదండం పెట్టే బుక్కెడు తింటం. వరి కోసినా , పంటపండినా దేవునికి దండం పెడ్తం. ఇక్కడ నా గోబాజాతర జరుగుతలేదా? మీరు చెప్పితేనే జరుగుతున్నదా? నిర్మల్ ల దేవాలయాలన్నీ బీజేపోళ్లే కట్టించిండ్రా?ముఖ్యం గా యవకులు ఈ పిచ్చి పోరులో కొట్టుకపోవద్దు. మన పక్కన ఉన్న చైనా వాడు మేలుకొన్నడు..దేశం పిడికిలి బిగించిండ్రు.. కులం లేదు.. మతం లేదు.. జాతి లేదు.. లింగభేదం లేదు. అన్ని పనులుఅందరు చేస్తరు. ఈ కులాల కుళ్లు, మతాల చిచ్చుఉన్నంత వరకు మనం బాగు పడం
మద్దతు ధర మన చేతిలో లేదు
డైలాగులు కొడితే రైతులకు గిట్టు బాటు ధరరాదు. ఈ దేశంలో కనీస మద్దతు ధరను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకున్నది. నిజామాబాద్ జిల్లాలో కూడా రైతులు పసుపు ధరఇయ్యాలె అని అంటున్నరు. ఇయ్యాలె కరెక్టే..కానీ అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు.ఐదేండ్ల నుంచి ఐదు వందల దరఖాస్తులు ఇచ్చినం. నేను స్వయంగా మోడీకి చెప్పిన.పసుపుకు బోర్డు పెట్టి, ధర ప్రకటించమని చెప్పిన. ఐదేండ్లు పెడచెవిన పెట్టిండు. బీజేపీఎంత సిగ్గు లేని పార్టీ అంటే.. ఇయ్యాల ఆపార్టీ జాతీయ సెక్రటరీ నిజామాబాద్‌కు వచ్చి ‘మమ్ముల్ని గెలిపి య్యండి.. మూడ్రోజుల్లో నేపెడుతరు’ అని అంటున్నడు. మరి ఈ ఐదేండ్లు-యాడ పండుకున్నవ్ బిడ్డా..? ఎలక్షన్‌లో ఓట్ల కోసం ఇంత దిగజారి, ఇంత నీ చంగా మాట్లాడుతరా? వాళ్లను తొక్కుడు తొక్కితే పాతాళానికితొక్కాలె. ఎలక్షన్‌లో పార్టీలు కాదు.. ప్రజలు,వారి అభిమతం గెల్వాలె. ఆ పరిపక్వత ప్రజాస్వామ్యంలో రావాలె. కానీ దురదృష్టవశాత్తూ..మన దగ్గర రాలె. ఏది పడితే అది చెప్పడం..ఓట్లు దంచుకొని పోవడం.. ఇది జరుగుతాఉంది. అది పోవాలె.