
నీటి సమస్యల పరిష్కారాల విషయంలో సీఎం కేసీఆర్ కి శుత్తశుద్ది లేదన్నారు బీజేపీ నేత డీకే అరుణ. కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేయలేక కేంద్రం పై విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గుందా కేసీఆర్ నీకు కేంద్రంపై విమర్శలు చేయడానికి అంటూ ప్రశ్నించారు. నీటి వివాదాల పరిష్కారానికి కేంద్రం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఆగస్ట్ 5 న ఏర్పాటు చేస్తే ఇప్పుడు కుదరదంటవా? అపెక్స్ కౌన్సిల్ భేటీకి వెల్లకపోవడానికి సీఎంకు ఉన్న ముఖ్యమైన పనేంటో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్న డీకే అరుణ.. GHMC ఎన్నికల కోసం డ్రామాలాడుతున్నారన్నారు.
మాటలతో కడుపు నింపుతున్నాడు
ఏపీ సీఎం జగన్-కేసీఆర్ మధ్య అంతర్గత ఒప్పందం జరిగింది అన్నది బయట ప్రచారం జరుగుతోందన్నారు డీకే అరుణ. అందుకే కేసీఆర్ మాట్లాడడం లేదన్నారు. కేసీఆర్ ఆరేళ్ళ పాలనలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మాణం-డిజైన్ చేశారా అని ప్రశ్నించారు. నల్గొండ-పాలమూరు జిల్లా ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని.. కృష్ణానది వాటాలో తెలంగాణ నీళ్లు తెలంగాణ ప్రజలకే దక్కాలన్నారు. జూరాల నీళ్లు వెంటనే తీసుకునే విదంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలన్నారు. కేంద్రం వారం రోజుల ముందు చెప్పిందని..ఎన్ని పనులు ఉన్నా సీఎం లు ఇద్దరు భేటీకి హాజరు కావాల్సిందేనన్నారు.
జగన్-కేసీఆర్ చీకటి ఒప్పందం ఏంటో కేసీఆర్ మౌనమే చెప్తుందన్న డీకే అరుణ..దక్షిణ తెలంగాణ లో నీటి ప్రాజెక్టులు కట్టడం లో కేసీఆర్ వైఫలం అయ్యారని ఆరోపించారు. జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి కి నీళ్లు తేవాలని మేము మొదటి నుంచి చెబుతున్నా..రాష్ట్రానికి వచ్చే నీళ్ల వాటాను కూడా తెలంగాణ సర్కార్ వాడుకోవడం లేదన్నారు. నేను హారతులు పట్టినట్టు గతంలో ప్రచారం చేశారు…కానీ నేను ఎవరికీ హారతులు పట్టలేదని స్పష్టం చేశారు. నాపై చేసే దుష్ప్రచారం సెంటిమెంట్ గా వాడుకోవడానికి మాత్రమేనన్నారు. మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆ రోజు వెళ్ళానన్నారు. కేసీఆర్ రాయలసీమను రత్నాల సీమ చేస్తా అంటే తప్పు లేదు… కానీ నేను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వెళ్తే తప్పా అని ప్రశ్నించారు.