ఫిబ్రవరిలోనే పోడు భూముల పంపిణీ: కేసీఆర్

ఫిబ్రవరిలోనే పోడు భూముల పంపిణీ: కేసీఆర్
  • త్రీపేస్ కరెంటు కనెక్షన్లు ఇస్తం
  • గిరిజన వికాసం కింద నీటి వసతి
  • రాష్ట్రంలో 11.5 0 లక్షల ఎకరాల పోడు భూమి
  • ఉద్యోగం ఉపాధి లేని గిరిజనులకు గిరిజనబంధు

పోడు భూములకు సంబంధించి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. క్షేత్ర స్థాయిలో లెక్కలు తీశామని రాష్ట్రంలో 11.50 లక్షల ఎకరాల పోడు భూములున్నట్టు గుర్తించామని ఆయన అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఈ లెక్క ఇంతకే పరిమితం కావాలని, మళ్లీ అడవులను నరుకుతామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీప్రాంత రక్షణ కోసం సాయుధ బలగాలను నియమిస్తామని చెప్పారు. పట్టాలుపొందాలంటే గ్రామాల వారీగా తీర్మానాలు చేయాలన్నారు. ఈ తీర్మానంలో అఖిలపక్ష నాయకులు, గిరిజన పెద్దలు, సర్పంచ్, ఎంపీటీసీ సంతకాలు చేయాల్సి ఉంటుందన్నారు. అలా తీర్మానం చేయని గ్రామాల్లో పట్టాల పంపిణీ ఉండబోదని స్పష్టం చేశారు. ‘కొంత మంది ఛత్తీస్ గఢ్ నుంచి గొత్తికోయలను తీసుకొచ్చి అడవులను నరికేయిస్తుండ్రు.. వాళ్లు అటవీ అధికారుల మీద దాడులు చేస్తుండ్రు..ఇది న్యాయమా..? అని ప్రశ్నించారు. ‘గవర్నమెంట్ దయతలచి ఇస్తే దానిని తీసుకోవాలె.. గతంలో ఆర్వో ఎఫ్​ఆర్ పట్టాలు ఇచ్చారు. వాళ్లకూ రైతుబంధు కూడా ఇస్తున్నం. 400 కోట్లు సాంక్షన్ చేసి భద్రాద్రి జిల్లాల్లోని గిరిజన ఆవాసాల్లో మూడు ఫేజ్ ల కరెంటు కనెక్షన్లు ఇప్పించినం’సర్వే పూర్తయిన 11.5 లక్షల ఎకరాలు పంచి పెడతం.. కరెంటు కనెక్షన్, రైతుబంధు కూడా ఇప్పిస్తం.. ఓట్ల కోసం ఓ మాట.. ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పే పార్టీ కాదు మాది.. గిరి వికాసం కింద నీటి వసతి కూడా కల్పిస్తeఅని సీఎం చెప్పారు.