ఆర్టీసీ భవిష్యత్తుపై కేసీఆర్ చర్చ

ఆర్టీసీ భవిష్యత్తుపై కేసీఆర్ చర్చ

హైదరాబాద్: ప్రగతి భవన్ లో రవాణాశాఖా అధికారుల సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఆర్టీసీ భవిష్యత్తుపై కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించడంతో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 28, 29వ తేదీల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నివేదికపై ఈ సమీక్షా సమావేశంలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నివేదికను గురువారం జరగనున్న రాష్ట్ర కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంలో రూట్లను ప్రైవేటీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్టీసీకి సంబంధించిన తాజా పరిణామాలను సీఎం కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది.

See Also:అమెరికాలో తెలుగు యువతిపై అత్యాచారం.. హత్య