V6 News

30 ల‌క్షల ట‌న్నుల బాయిల్డ్ రైస్ సేక‌రించండి: కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

30 ల‌క్షల ట‌న్నుల బాయిల్డ్ రైస్ సేక‌రించండి: కేంద్రానికి సీఎం విజ్ఞప్తి
  • పాత బ‌కాయిలు రూ.1,468.94 కోట్లు విడుద‌ల చేయండి
  • పోష‌కాహార బియ్యం పంపిణీని పునఃప్రారంభించండి
  • కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి
  • 5 శాతం నూక‌తో బాయిల్డ్ రైస్ స‌ర‌ఫ‌రాకు సిద్ధమని వెల్లడి
  • సీఎం, మంత్రి ప్రతిపాద‌న‌కు కేంద్ర మంత్రి సూత్రప్రాయ ఆమోదం

న్యూఢిల్లీ, వెలుగు: యాసంగి పంట‌‌‌‌కు సంబంధించి తెలంగాణ నుంచి 30 ల‌‌‌‌క్షల మెట్రిక్ ట‌‌‌‌న్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేక‌‌‌‌రించాల‌‌‌‌ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర‌‌‌‌ స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణలో యాసంగి పంట‌‌‌‌ బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌‌‌‌కు అనుకూలమని వారు కేంద్ర మంత్రికి తెలిపారు. గత ఆరు యాసంగి సీజ‌‌‌‌న్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విష‌‌‌‌యం స్పష్టమ‌‌‌‌వుతుంద‌‌‌‌న్నారు. 

ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని ఆయ‌‌‌‌న నివాసంలో సీఎం, రాష్ట్ర మంత్రి శుక్రవారం ఉద‌‌‌‌యం క‌‌‌‌లిశారు. ఈ స‌‌‌‌మావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేంద‌‌‌‌ర్ రెడ్డి, సెక్రట‌‌‌‌రీ కోఆర్డినేష‌‌‌‌న్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో.. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌‌‌‌కు భారీ డిమాండ్ ఉన్నందున స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రా పెంచాల‌‌‌‌ని ఇటీవ‌‌‌‌ల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విష‌‌‌‌యాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తుచేశారు. తెలంగాణ‌‌‌‌లో ఈ యాసంగి సీజ‌‌‌‌న్‌‌‌‌లో 90 ఎల్ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందన్నారు.

యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌‌‌‌కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి.. మొత్తం 30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూక‌‌‌‌తో), 5 ఎల్ఎంటీ రా రైస్ (10 శాతం నూక‌‌‌‌తో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌‌‌‌న్నారు. బాయిల్డ్ రైస్ స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రాకు సంబంధించి సీఎం, రాష్ట్ర మంత్రి చేసిన ప్రతిపాద‌‌‌‌న‌‌‌‌కు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.

బకాయిలూ విడుదల చేయండి..
2014–15 వ‌‌‌‌ర్షాకాలం పంట అద‌‌‌‌న‌‌‌‌పు లెవీ సేక‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌కు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బ‌‌‌‌కాయిల‌‌‌‌ను వెంట‌‌‌‌నే విడుద‌‌‌‌ల చేయాల‌‌‌‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దేశంలోనే వ‌‌‌‌రి ధాన్యం ఉత్పత్తి, సేక‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌లో తెలంగాణ అగ్రగామిగా ఉంద‌‌‌‌ని, ధాన్యం సేక‌‌‌‌రించిన 48 గంట‌‌‌‌ల్లోనే రైతుల‌‌‌‌కు తాము చెల్లింపులు చేస్తున్నామ‌‌‌‌ని కేంద్ర మంత్రికి వివరించారు.

రాష్ట్ర పౌర‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంట‌‌‌‌నే పాత బ‌‌‌‌కాయిలు విడుద‌‌‌‌ల చేయాల‌‌‌‌ని కేంద్ర మంత్రిని రిక్వెస్ట్ చేశారు. పిల్లల్లో ర‌‌‌‌క్తహీన‌‌‌‌త‌‌‌‌, పోష‌‌‌‌కాల లోపాల‌‌‌‌ నివార‌‌‌‌ణ‌‌‌‌కు గానూ పోష‌‌‌‌కాహార బియ్యాన్ని (ఎఫ్ఆర్కే) పాఠ‌‌‌‌శాల‌‌‌‌లు, వ‌‌‌‌స‌‌‌‌తిగృహాలు, ఐసీడీఎస్‌‌‌‌ల ప‌‌‌‌రిధిలో పంపిణీ చేసేవార‌‌‌‌ని.. ఇటీవ‌‌‌‌ల దానిని నిలిపివేసినందున వెంట‌‌‌‌నే దానిని పునః ప్రారంభించాల‌‌‌‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సర్వేపల్లికి సీఎం రేవంత్​ నివాళి
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి.. రాధాకృష్ణన్ ఫొటో వద్ద నివాళులర్పించారు. రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. రాధాకృష్ణన్ దేశ తొలి ఉప రాష్ట్రపతిగా సేవలందించారన్నారు. 

భారతదేశం గర్వించదగ్గ గొప్ప తత్వవేత్త, విద్యావేత్త అని కొనియాడారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.