ఫిన్లాండ్ వెళ్లొచ్చిన టీచర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు సీఎం రేవంత్. గురువారం ( జులై 30 ) హైదరాబాద్ లోని MCRHRDలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. రాష్ట్రంలో విద్యాశాఖ లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని.. తనను రాజీనామా చేయమని అంటున్నారని అన్నారు. ఎందుకు రాజీనామా చేయాలో వారు చెప్పడం లేదని.. ITIలను ATCలు గా మార్చినందుకు రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు సీఎం రేవంత్.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీచర్లతో మాట్లాడిన సీఎం వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఫిన్లాండ్ లోని విద్యావిధానం గురించి వివరాలు ఆరా తీశారు సీఎం రేవంత్. దేశంలోని ఐఐటీలు, ఐఐఎంలు తెచ్చింది నెహ్రు అని..ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మొదటి ప్రాధాన్యతగా నెహ్రు ముందుకెళ్లారని అన్నారు సీఎం రేవంత్. 140 కోట్ల మందికి నేడు ఆహారం దొరుకుతుందంటే అందుకు నెహ్రు ప్రణాళికలు కారణమని అన్నారు.
ALSO READ : హాకీ ఆటగాళ్లకు కాషాయం రంగు చొక్కాలు
12 ఏళ్లలో మోడీ రూ.151 లక్షల కోట్లు అప్పు చేశారని... 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అప్పు రూ. 51 లక్షలు అని అన్నారు. దేశం అప్పు రూ.201 లక్షల కోట్లు ఉందని అన్నారు.ప్రపంచంతో పోటీ పడాలంటే విద్యలో నాణ్యత కావాలని... ఆహారంలో పోషకాహారం కావాలని అన్నారు సీఎం రేవంత్. వెనకబాటు తనానికి ఆస్థి లేకపోవడం కాదు.. విద్య లేకపోవడం కారణమని అన్నారు సీఎం రేవంత్.
