సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సోమవారం (నవంబర్ 24) ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఆయన సీజేఐ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారోత్స కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ఆయన చేత సీజేఐగా ప్రమాణం చేయించారు. 

అనంతరం భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‎లో సోమవారం (నవంబర్ 24)  జరిగిన ప్రమాణస్వీకారోత్స కార్యక్రమంలో మాజీ సీజేఐ బీఆర్ గవాయ్, ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు హాజరయ్యారు. 

జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదివారం (నవంబర్ 23) సాయంత్రం సీజేఐగా పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్2025, అక్టోబర్ 30న సీజేఐగా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 15 నెలలపాటు కొనసాగనున్నారు. 2027 ఫిబ్రవరి 9న ఆయన రిటైర్ కానున్నారు.

జస్టిస్ సూర్యకాంత్ హర్యానాలోని హిసార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. హిసార్‎లో 1984లో లాయర్‎గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆయన అంచెలంచెలుగా సీజేఐ స్థాయికి ఎదిగారు. సుప్రీంకోర్టు జడ్జిగా తన కెరీర్‎లో ఆయన చరిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు తీర్పును ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్​సభ్యుడిగా ఉన్నారు.