
హైదరాబాద్: బసవేశ్వరుడి సందేశంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం (మే 23) సీఎం రేవంత్ సంగారెడ్డ జిల్లా జహీరాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా హగ్గెల్లి కూడలిలో బసవేశ్వర విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బసవేశ్వరుడు ఆనాడే సామాజిక న్యాయం కోసం పోరాడాడని.. ఆయన సందేశాలే ఇందిరమ్మ పాలనకు సూచికగా భావిస్తున్నామన్నారు.
Also Read : మేము అడిగితే రాజకీయం అన్నారు
సామాజిక న్యాయాన్ని అందించే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. జనగణనలో కుల గణన చేయాలని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలతో కలిసి నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ పాఠశాల భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.