
BRS, BJP వేర్వేరు కాదని, గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత పది సంవత్సరాలు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న సంబంధంపై తాము ప్రశ్నిస్తూనే ఉన్నామని అన్నారు. తాము అడిగితే రాజకీయం అన్ని అన్నారు.. మరి కేసీఆర్ కూతురే ఈ ప్రశ్నలు అడిగిందని.. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తన తండ్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు రాసిన లేఖపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2001 నుంచి పార్టీలో ఉన్నవారికి ఎందుకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదని, బీజేపీ పై సరైన విమర్శలు ఎందుకు చేయలేదని కవిత ప్రశ్నించారు. కవిత నేరుగా పార్టీ అధ్యక్షుడిపైనే విమర్శలు చేశారు. దీనిపై దీనిపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు లు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం వ్యాఖ్యలు:
- గతంలో తెలంగాణ సగటు మనిషికి ఉన్న అనుమానం ఈ రోజు కవిత వ్యక్తం చేశారు.
- కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగే విధంగా కవిత లేఖ ఉంది
- కాంగ్రెస్ పార్టీ, బీజేపీలోని కొందరితో Brs పార్టీలోని కొంత మంది ఎందుకు స్నేహపూర్వకంగా ఉంటున్నారని కవిత ప్రశ్నించారు.
- గతంలో 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ తో బీఆర్ఎస్ ఎందుకు స్నేహంగా ఉందని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు
- ఇంత పెద్ద ఎత్తున కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా.. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తున్నా కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు.
- ఈరోజు కవిత అడుగుతున్నారు దానికి కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీశ్ రావు జవాబు చెప్పాలి
- ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ బీఆర్ఎస్.
- పార్టీ అధ్యక్షుడు సామాన్య కార్యకర్తలకు కలవడం లేదని కూతురే విమర్శిస్తోంది.
- అధ్యక్షుడు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు..కార్యకర్తల కష్టాలు పంచుకోవడం లేదు..
- అంతపెద్ద సభలో 2001 నుండి పార్టీ లో ఉన్న సీనియర్ లకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదని కవిత లేఖలో ప్రశ్నించింది.
- కవిత లేవనెత్తిన అంశాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , పార్టీ ట్రబుల్ షూటర్ అని చెప్పుకునే హరీష్ రావు , అధ్యక్షుడు కేసీఆర్ సమాధానం చెప్పాలి
- మేము ముందు నుండి చెప్తున్నాం.. బీజేపీ, బీఆర్ఎస్ వేరువేరు కాదు.
- ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ లాగా వ్యవహరిస్తున్నారు.. దీనికి కవిత రాసిన లేఖ ఆధారం.
- బీజేపీ నాయకత్వం కూడా సమాధానం చెప్పాలి.
- బీజేపీ తో బీఆర్ఎస్ కు లోపాయికారి ఒప్పందం ఉంది
- మొన్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నామినేషన్ వేస్తే మద్దతు ఇస్తామని చెప్పారు బీఆర్ఎస్ నేతలు చెప్పారు.
- బీజేపీ లో ఉన్న బీఆర్ఎస్ వ్యతిరేకులు..బీఆర్ఎస్ లో ఉన్న బీజేపీ వ్యతిరేకులు అలాంటి అవకాశం ఇవ్వలేదు..
- వారి రహస్య ఒప్పందం అమలు జరగలేదు
- ఇది ఆ ఒక్కరోజే కాదు పార్లమెంట్ ఎన్నికల్లో చేతులెత్తీసి పార్టీని బీజేపీ కి సరెండర్ చేశారు..
- ఆరోజు మేము మాట్లాడితే రాజకీయ విమర్శలు అన్నారు..
- బీజేపీకి ప్రత్యామ్నాయం అని ఎదుగుతున్న సందర్భంలో మనమే బీజేపికి సరెండర్ చేస్తున్నాం అని అడుగుతున్నారు
- కవిత ప్రశ్నలకు బీజేపీ నాయకత్వం , బీఆర్ఎస్ పెద్దలు స్పందించాలి
- బీజేపీ అధ్యక్షుడు గా బండి సంజయ్ ఉన్నప్పుడు.. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ అగ్రిమెంట్ ప్రకారం.. కేసీఆర్ సూచన మేరకే కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయ్యారు..
- కిషన్ రెడ్డి కేసీఆర్ ప్రతిపాదించిన అధ్యక్షుడు కాదా..? దీనిపై స్పందించాలి..
- దేశ బడ్జెట్ లో తెలంగాణ కు రూపాయి ఇవ్వకపోయినా కేసీఆర్ ప్రశ్నించలేదు.
- విభజన హామీలు అమలు కాకపోయినా మాట్లాడలేదు
- సీలేరు ప్రాజెక్ట్ ఎత్తుకుపోతే ఎందుకు మౌనంగా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి
- కవిత లేఖను, ప్రశ్నల నుంచి ప్రజలను డైవర్షన్ చేయడానికి కేటీఆర్ మీడియా చిట్ చాట్ చేశారు
- నేషనల్ హెరాల్డ్ పత్రిక పై ఈడి పేరుతో వేధింపులు జరుపుతున్న కేసు.. ఇది బీజేపీ వేధింపు కార్యక్రమం
- ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు సంపాదించుకోవాలనుకుంటే లెక్క కాదు
- 50 మంది ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులను చేసిన ఘనత వారిది.. సంపాదించుకోవాలి అనుకుంటే ఎంత..?
- కానీ వారు దేశం కోసం నిస్వార్థంగా పనిచేశారు.. చేస్తున్నారు..
- డైరెక్ట్ గా ఎదుర్కోలేకే వేధింపులు....
- కేటీఆర్ బీజేపీ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి పై మాట్లాడుతున్నారు
- కాళేశ్వరం కూలిన నాడు మీరే అధికారంలో ఉన్నారు..
- కాళేశ్వరం బాంబు పెట్టారేమో అని కమిషన్ వేశారు
- నేను కాళేశ్వరం విజిట్ చేశా
- కాంగ్రెస్ పార్టీకి అంతర్గత ప్రజాస్వామ్యం ముందు నుంచీ ఉంది
- 2023 లో మిమ్మల్ని మట్టి కరిపించి చూపించారు ప్రజలు
- కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకత్వాన్ని గెలిపించారు
- ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ తో టచ్ లో ఉందనడం అపోహ
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం
- కరీంనగర్ లో శాతవాహన యూనివర్సిటీ కి.. లా కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలను తెచ్చాం.
- ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చాం.. డంప్ యార్డ్ తొలగించే ప్రయత్నం చేస్తున్నాం
- ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉంటే పని జరుగుతుంది.. లేకపోతే పని జరగదు అని కాదు..
- స్థానిక శాసన సభ్యుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం సరికాదు
- కరీంనగర్ లో ఏ అభివృద్ధి జరిగినా అది మా వళ్లే..
- బీఆర్ఎస్ హయాంలో స్మార్ట్ సిటీ పేరు మీద వందల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారు. .మేమే చెల్లిస్తున్నాం
- మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నాం, నర్సింగ్ కాలేజీ నిర్మిస్తున్నాం
- మిగతా నియోజకవర్గాల మాదిరిగా కరీంనగర్ లో కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం
- బద్దిపల్లి లో 8 వేల ఇళ్లు కట్టించాం