- విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: వేములవాడ మున్సిపాలిటీలో 26 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సిర్రం శిరీష ప్రసాద్‌యాదవ్‌ను గెలిపిస్తే తాను అండగా ఉండి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని విప్, ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్ ప్రజలను కోరారు. బుధవారం ఆయన సిర్రం శిరీశకు మద్దతుగా వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేములవాడ అభివృద్ధి చెందుతోందన్నారు.
ఈ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రతిపక్ష పార్టీలను కాకుండా, అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇప్పటికే బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చారని, ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. సిర్రం శిరీష మంచి కుటుంబం నుంచి సేవ చేయడానికి వచ్చారని ఆమెను గెలిపించాలని కోరారు.
