- నేడు సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. సీఎం సన్మాన సభకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మాదిగ ఉద్యోగులు పెద్దఎత్తున తరలి రావాలని మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది.కాగా, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని ఎస్సీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సీఎం సన్మాన కార్యక్రమానికి భారీగా మాదిగ ఉద్యోగులు రావాలని పిలుపునిచ్చారు.
