సమ్మక్క, సారక్కలను దర్శించుకున్న సీఎం రేవంత్ రడ్డి..

సమ్మక్క, సారక్కలను దర్శించుకున్న సీఎం రేవంత్ రడ్డి..

తెలంగాణ కుంభమేళా, మేడారం జాతరను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. సీఎంకు మంత్రి సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవార్లకు రేవంత్ రెడ్డి నిలివెత్తు బంగారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.