
తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి . కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మకు సీఎం రేవంత్ ఎక్స్ లో విషెస్ చెప్పారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, స్కీంలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలంటూ ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి.
71 మందితో మోదీ కొత్త కేబినెట్ కొలువు దీరిన సంగతి తెలిసిందే. ఇందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది. కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడికి కేబినెట్ ర్యాంక్ పదవి. బండి సంజయ్, శ్రీనివాస వర్మకు సహాయ మంత్రులుగా పదవులు దక్కాయి.