నల్లగొండకు కాదు... అసెంబ్లీకి రండి

నల్లగొండకు కాదు... అసెంబ్లీకి రండి

చావు నోట్లో తల పెట్టానని కేసీఆర్​ ఎన్నిసార్లు చెబుతారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.కేసీఆర్​ బండారం బయటపడుతుందనే ఇవాళ రాలేదన్నారు. నల్లగొండకు కాదు.. రేపు అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్​ అన్నారు. కాళేశ్వరంలో వేల కోట్లు అవినీతి జరిగిందని కాగ్​ కూడా నివేదిక కూడా ఇచ్చిందన్నారు.  కాలు విరిగిందనే నెపంతో కేసీఆర్​ అసెంబ్లీకి రాలేదన్నారు.  నల్గొండ సభకు ఎలా వెళ్లారని  సీఎం రేవంత్​ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణంలో అడుగడుగునా అక్రమాలే జరిగాయన్నారు.  బ్యారేజ్​ కు ముప్పు ఉందని 2020లోనే గుర్తించారన్నారు.  

కేసీఆర్​ సత్య హరిశ్చంద్రుడైతే అసెంబ్లీకి ఎందుకు రాలేదన్నారు. కేసీఆర్​ బ్లాక్​ మెయిల్​ కు  పాల్పడుతున్నారని విమర్శించారు.  కాళేశ్వరం అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే రావడానికి ఎందుకు భయపెడుతున్నారు... నల్లగొండ సభలో కేసీఆర్​ సభలో మళ్లీ అధికారంలోకి వస్తామని నల్లగొండలో  చెబుతున్నారని... ఉద్యమం ముసుగులో పసి పిల్లలను చంపి  తాము  అధికారంలోకి రాలేదని సీఎం రేవంత్​ అన్నారు. మేడిగడ్డను 1800 కోట్లతో అంచనా వేస్తే కేసీఆర్​ ప్రభుత్వం 4 వేల కోట్లకు పెంచామన్నారు.

ప్రతి పక్ష పార్టీ నేతగా కేసీఆర్​ బాధ్యతలను నెరవేర్చాలని సీఎం రేవంత్​ అన్నారు.ఇరిగేషన్​ పై కేసీఆర్​ సూచనలు ఇస్తే పాటిస్తామన్నారు.  మేడిగడ్డ ప్రాజెక్ట్​ కుంగిపోతే ఏమవుతుందని బాధ్యతారహితంగా  కేసీఆర్​ అంటున్నారని సీఎం రేవంత్​ అన్నారు.  కేసీఆర్​ నిజాయితీ పరుడని తెలంగాణం సమాజం భావిస్తుందా అని ప్రశ్నించారు. కృష్ణా ప్రాజెక్ట్​లను ఏ విధంగా కాపాడుకోవాలని మాజీ సీఎం కేసీఆర్​ చెప్పాలని సీఎం రేవంత్​డిమాండ్​ చేశారు.

కేసీఆర్​ కు సీఎం కుర్చీ పోగానే నీళ్లు, నల్లగొండ ఫ్లోరైడ్​ గుర్తొచ్చిందన్నారు.  హరీశ్​ రావు లాంటి వారికి బీఆర్​ఎస్​ లో విలువలేదన్నారు.  నల్లగొండ సభ కాదు.. రేపు అసెంబ్లీకి రమ్మన్నారు.  కేసీఆర్​ చేసిన తప్పులను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు.  

బీజేపీ.. బీఆర్​ఎస్​ చీకటి పొత్తు పెట్టుకున్నారని సీఎం రేవంత్​ అన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్​ను పరిశీలించడానికి అందరూ ఎమ్మెల్యేలను ఆహ్వానించామన్నారు.  బీజేపీ ఎమ్మెల్యేలు రాకుండా కిషన్​ రెడ్డి అడ్డుకున్నారన్నారు.