రైతుబంధు అడిగితే.. చెప్పుతో కొట్టాలంటారా.. ఎన్ని గుండెలు రా మీకు: కేసీఆర్

రైతుబంధు అడిగితే.. చెప్పుతో కొట్టాలంటారా.. ఎన్ని గుండెలు రా మీకు: కేసీఆర్

బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ సమృద్ధిగా వచ్చింది. కేసీఆర్ పదవి నుంచి తప్పుకోగానే ఎందుకు కరెంట్ కట్ అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్  వచ్చిన మాటిమాటికి ఎందుకు కరెంట్ పోతుంది.. దద్దమ్మల పాలనలో ఇలాగే ఉంటుందని ఫైర్ అయ్యింది. నా హయాం కంటే 5600 మెగావాట్ల కరెంట్ ఎక్కువ ఉత్పత్తి అవుతోంది. మరి ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. మీకు తెలివిలేక, చాతకాక, నడపరాక.. ఇయ్యాల మందిమీద బదులాం పెట్టి బతుకుదామనుకుంటున్నారా?.. అట్లా బతుకనియ్యం.. నీళ్లు, కరెంట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేదేలేదు.. వెంటపడుతాం.. వేటాడుతామని హెచ్చరించారు. 

రైతుబంధు కూడా ఇయ్యరా..ఇస్తే ఇచ్చినవ్.. ఇయ్యకపోతే ఇయ్యలే.. అన్నదాతలను పట్టుకుని.. రైతుబంధు అడుగుతే.. చెప్పుతో కొడుతామంటారా.. ఎన్ని గుండెలు రా మీకు అని ఫైర్ అయ్యారు. ఒక్కమాట చెబుతున్నా జాగ్రత్తా.. చెప్పులు, పంటలు పండించే రైతులకు కూడా ఉంటయ్..ఒక్క దెబ్బతో మూడు పళ్లు ఊసిపోతయ్ అని కేసీఆర్ మండిపడ్డారు.