విజయ్ ఆలస్యంగా రావడం వల్లే తొక్కిసలాట: సీఎం స్టాలిన్

విజయ్ ఆలస్యంగా రావడం వల్లే తొక్కిసలాట: సీఎం స్టాలిన్

చెన్నై: తమిళనాడులోని కరూర్‎లో జరిగిన తొక్కిసలాటకు తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయే కారణమని రాష్ట్ర సీఎం ఎంకే  స్టాలిన్ ఆరోపించారు. ర్యాలీకి విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు ప్రధాన కారణమని తెలిపారు. టీవీకే చేసిన షెడ్యూల్ తప్పిదాల వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనపై బుధవారం తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది. 

‘‘ర్యాలీకి విజయ్ మధ్యాహ్నం వస్తారని టీవీకే పేర్కొంది. అయితే, ఆయన మాత్రం ఏడు గంటలు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే పెద్ద ఎత్తున జనం గుమిగూడి ఆయన ప్రచార రథాన్ని నిలిపివేశారు.ఈ క్రమంలో అక్కడ గందరగోళం చోటు చేసుకోవడంతో ఊపిరాడక తొక్కిసలాట చోటు చేసుకుంది. విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు ముఖ్య కారణం” అని పేర్కొన్నారు.