బిగ్ బాస్ తమిళ ఫేమ్, జల్లికట్టు ఉద్యమంతో పాపులర్ అయిన నటి మరియా జూలియనా ( జూలీ ). అయితే లేటెస్ట్ గా దళపతి విజయ్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీ మద్దతుదారుల టార్గెటింగ్ వల్లే తాను గర్భస్రావం (Miscarriage) ఎదుర్కొన్నానని జూలీ కన్నీటిపర్యంతమైంది.
నాడ్డను కోల్పోయా..
సోషల్ మీడియాలో ట్రోలింగ్, క్యారెక్టర్ అస్సాసినేషన్ తనను ఎంతగా కుంగదీశాయో వివరించింది. నాకు కొత్తగా పెళ్లయింది. ఆన్‌లైన్ వేధింపుల వల్ల కలిగిన తీవ్ర మానసిక క్షోభ కారణంగా నా కడుపులోని మొదటి బిడ్డను కోల్పోయాను. దీని వెనుక నేరుగా విజయ్ అన్న లేకపోవచ్చు.. కానీ తన ఫ్యాన్స్‌ను ఒక్క మాటతో వెనక్కి తగ్గమని ఆయన చెప్పి ఉంటే, ఈ రోజు నా బిడ్డ బ్రతికే ఉండేది అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.
కిడ్నీ స్కామ్ డ్రామా..
తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాతే, తన భర్తపై రూ. 15 లక్షల కిడ్నీ స్కామ్ ఆరోపణలు తెరపైకి తెచ్చారని జూలీ మండిపడింది. ఒక టీవీకే (TVK) లాయర్, మద్దతుదారుడు కలిసి పక్కా కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌తో ఈ అబద్ధపు కథనాన్ని సృష్టించారని ఆరోపించింది. DMK ప్రభుత్వం నుండి TVK ప్రభుత్వంలోకి మారిన తర్వాత తనకు నోటీసులు రావడం వెనుక అంతర్యం ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది..
వేధింపులపై గతంలోనే ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదేని జూలీ ప్రశ్నించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విజయ్ అన్న సీఎం అయ్యారంటూ కామెంట్స్ చేసింది. ఒక మహిళ టీవీకే పార్టీ గురించి మాట్లాడితే, ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తారా? అంటూ జూలీ ప్రశ్నించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంచలన ఆరోపణలపై సీఎం విజయ్ ఫ్యాన్స్ , టీవీకే వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Julie vs Vijay
— Slow Burn (@slow_burn___) May 29, 2026
Whatta deadly fight. Place your bets on this even steven contest #oviyaarmy forever 💪🏽 pic.twitter.com/XI33r0rd1n
