V6 News

బోరబండలో వరద నీటి కష్టాలకు చెక్

బోరబండలో వరద నీటి కష్టాలకు చెక్
  •     బాక్స్ డ్రెయిన్,  రిటైనింగ్ వాల్స్  నిర్మాణానికి స్టాండింగ్​ కమిటీ ఆమోదం  
  •      బాలానగర్ ఫ్లైఓవర్ కింద స్పోర్ట్స్ ఏరియా 
  •      సీఎంసీ స్టాండింగ్ కమిటీలో 7 అంశాలకు ఆమోదం

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంఎసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఆధ్యర్యంలో సెక్రటరీయేట్ లో జరిగింది. కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఏడు  ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. బాలానగర్ ఫ్లైఓవర్ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా రూ. 2.50 కోట్లతో ఫ్లైఓవర్ కింద ఖాళీ స్థలాన్ని స్పోర్ట్స్ ఏరియాగా మార్చేందుకు ఆమోదించారు. 

మాదాపూర్ బోరబండ ప్రాంతంలో వరద నీటి కష్టాలు తీర్చేందుకు రూ. 2.99 కోట్లతో బాక్స్ డ్రెయిన్, రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రూ. 37 కోట్లతో గోపనపల్లి ఫ్లైఓవర్ నుంచి వట్టినాగులపల్లి మీదుగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వరకు కొత్త రోడ్డు పనులకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

మూసాపేట ప్రశాంత్ నగర్‌‌‌‌‌‌‌‌లో రూ.3 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో హిందూ శ్మశానవాటికను అభివృద్ధి చేసేందుకు ఓకే చెప్పారు. సీఎంసీ స్పోర్ట్స్ వింగ్‌‌‌‌‌‌‌‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్, గేమ్స్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. క్రీడా ప్రాంగాణాల్లో గేమ్స్ ఆడేందుకు బుకింగ్​చేసుకునే యూజర్ చార్జీలను సవరించారు. చెట్ల కొమ్మల కటింగ్, భద్రత కోసం రూ. 5.70 కోట్లతో 14 కొత్త బకెట్ లాడర్ వాహనాలను కొనుగోలు చేసేందుకు టేబుల్ అంశం(అప్పటికప్పుడు నిర్ణయించిన ప్రతిపాదన) కింద ఆమోదం తెలిపారు.