
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో బాధపడుతున్న వినియోగదారులకు కేంద్రం షాకిచ్చింది. సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ధరలను పెంచింది. కిలోకు రూ. 1 చొప్పున పెంచింది. దీంతో సీఎన్జీ ధర కిలోకు రూ. 74.09 నుంచి రూ. 75.09కి పెరిగింది. పెరిగిన ధరలు జూన్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి.
పెరిగిన సీఎన్జీ ధరలు ఎక్కడ ఎంతంటే?
- నోయిడా, గ్రేటర్ నోయిడా ..ఘజియాబాద్‌లలో కిలో రూ. 78.70 నుంచి రూ. 79.70కి పెరిగింది.
- యూపీలోని మీరట్, ముజఫర్‌నగర్, షామ్లీలో కిలో రూ.79.08 నుంచి రూ.80.08కి పెరిగింది.
- రాజస్థాన్‌లో అజ్మీర్, పాలి, రాజ్‌సమంద్ కిలో రూ.81.94 నుంచి రూ.82.94కి పెరిగింది