హసన్ పర్తి తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల  హాస్టల్లో నాగుపాము 

 హసన్ పర్తి తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల  హాస్టల్లో నాగుపాము 

హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా హసన్ పర్తి తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కాలేజ్ హాస్టల్లో 5 అడుగుల నాగు పాము కలకలం రేపింది. శుక్రవారం హాస్టల్ గదిలో పాము కనిపించడంతో అక్కడ పనిచేసే స్కావెంజర్, విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్ ఇందుమతికి సమాచారం అందించారు. దీంతో ప్రిన్సిపాల్ విద్యార్థులను బయటికి పంపించి, స్నేక్​ క్యాచర్​ సహాయంతో నాగు పామును పట్టి నిర్మానుష్యం ప్రదేశంలో వదిలేశారు.